ఐపీఎల్ 2023 మినీ వేలం తర్వాత 10 ఫ్రాంఛైజీలు ఎలా ఉన్నాయి... ఆ జట్ల కష్టాలు తీరినట్టేనా...

Published : Dec 24, 2022, 09:38 AM ISTUpdated : Dec 24, 2022, 01:46 PM IST

ఐపీఎల్ 2023 మినీ వేలం రికార్డులు క్రియేట్ చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక ఖరీదైన ప్లేయర్లుగా సామ్ కుర్రాన్, కామెరూన్ గ్రీన్ నిలవగా బెన్ స్టోక్స్, నికోలస్ పూరన్‌లకు రికార్డు ధర దక్కింది... వేలం ముగిసిన తర్వాత ఏ జట్టు ఎలా ఉంది... 

PREV
111
ఐపీఎల్ 2023 మినీ వేలం తర్వాత 10 ఫ్రాంఛైజీలు ఎలా ఉన్నాయి... ఆ జట్ల కష్టాలు తీరినట్టేనా...
Image credit: PTI

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేన్ విలియంసన్‌ని సాగనంపిన తర్వాత ఓపెనర్, కెప్టెన్ కోసం మినీ వేలంలో పాల్గొంది. ఈ రెండు ఆప్షన్లకు ఒకే ఛాయిస్‌ కనిపించినట్టుగా మయాంక్ అగర్వాల్‌ని భారీ ధరకు కొనుగోలు చేసింది ఆరెంజ్ ఆర్మీ. మయాంక్ అగర్వాల్ ఎంట్రీతో సన్‌రైజర్స్‌కి ఓపెనర్ దొరికినట్టే. మరి అతనికే కెప్టెన్సీ ఇస్తారా? లేక మరెవ్వరికైనా ఇస్తారా? అనేది చూడాలి...

211
Image credit: PTI

అన్‌మోల్ సింగ్, అకీల్ హుస్సేన్, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ దగర్, ఉపేంద్ర యాదవ్, సాన్వీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, వివ్‌రాంత్ శర్మ, మయాంక్ మర్కండే, అదిల్ రషీద్, హెన్రీచ్ క్లాసీన్, హారీ బ్రూక్‌లను వేలంలో కొనుగోలు చేసింది సన్‌రైజర్స్... అదిల్ రషీద్, మర్కండే రాకతో స్పిన్నర్ కొరత కూడా తీరినట్టే..

311

గత సీజన్‌లో 10 మ్యాచుల్లో నాలుగే గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి కూడా సీనియర్లకే ప్రాధాన్యం ఇచ్చింది. అజింకా రహానే‌ని జట్టులోకి తీసుకున్న సీఎస్‌కే, భారీ ధర చెల్లించి బెన్ స్టోక్స్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చింది. ధోనీ రిటైర్మెంట్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ని నడిపించే సారథిగా బెన్‌ స్టోక్స్‌ని చూస్తోంది సీఎస్‌కే మేనేజ్‌మెంట్. భగత్ వర్మ, అజయ్ మండల్, కేల్ జెమ్మిసన్, నిశాంత్ సింధు, షేక్ రషీద్‌లను వేలంలో కొనుగోలు చేసింది చెన్నై. వీరిలో జెమ్మిసన్ తర్వాత మిగిలిన వాళ్లు తుదిజట్టులోకి రావడం చాలా కష్టం..

411
Image credit: PTI

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ వేలంలో పెద్దగా స్టార్లను కొనుగోలు చేయలేదు. సోనూ యాదవ్, అవినాశ్ సింగ్, రజన్ కుమార్, మనోజ్ బండగే, హిమాన్షు శర్మ వంటి స్వదేశీ ప్లేయర్లను కొన్న ఆర్‌సీబీ, విల్ జాక్స్, రీస్ తోప్లేలను జట్టులోకి తీసుకొచ్చింది. వీరి రాకతో ఆర్‌సీబీకి కొత్తగా ఏమైనా ఒరుగుతుందా? అంటే చెప్పడం కష్టమే...

511
Image credit: PTI

ముంబై ఇండియన్స్ జట్టు గత సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్‌తో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈసారి కామెరూన్ గ్రీన్ కోసం రూ.17.5 కోట్లు పెట్టిన ముంబై, జే రిచర్డ్‌సన్‌, పియూష్ చావ్లాలను బేస్ ప్రైజ్‌కి పట్టుకొచ్చింది. వీరితో పాటు రాఘవ్ గోయల్, నెహాల్ వదేరా, శామ్స్ ములానీ, విష్ణు వినోడ్, డుయాన్ జాన్సెన్‌లను కొనుగోలు చేసింది ముంబై. గ్రీన్, ముంబై కష్టాలను ఎంతమేరకు తీరుస్తాడో చూడాలి..

611
Image credit: PTI

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఈసారి వేలంలో చాలా తెలివిగానే వ్యవరించింది. రూ.7.05 కోట్లతో మినీ వేలంలో దిగిన కేకేఆర్... షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, డేవిడ్ వీస్, నారాయణ్ జగదీశన్, మన్‌దీప్ సింగ్, కుల్వంత్ కెత్రోలియా, సుయాష్ శర్మ, వైభవ్ అరోరాలను తక్కువ ధరకే కొనుగోలు చేసింది...

711
Image credit: PTI

రాజస్థాన్ రాయల్స్‌ కూడా కాస్త తెలివిగానే వ్యవహరించింది. జో రూట్, ఆడమ్ జంపా, జాసన్ హోల్డర్‌లను బేస్ ప్రైజ్‌కి పట్టుకొచ్చిన రాయల్స్, అబ్దుల్ పీ ఏ, ఆకాశ్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కెఎం అసిఫ్, కునాల్ రాఘోడ్, డినోవన్ ఫెరారియా వంటి యంగ్ ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఈ కుర్రాళ్లను శాంసన్ ఎలా వాడుకుంటాడో చూడాలి...

811
Image credit: PTI

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మినీ వేలంలో మనీశ్ పాండే, ముకేశ్ కుమార్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, రిలే రసోలను కొనుగోలు చేసింది. టీమ్‌కి కావాల్సిన 25 మందిని కొనుగోలు చేసిన తర్వాత కూడా ఢిల్లీ పర్సులో రూ.5 కోట్ల వరకూ మిగులు ఉండడం విశేషం..

911
Image credit: PTI

పంజాబ్ కింగ్స్ జట్టు వేలంలో సామ్ కుర్రాన్ కోసం రూ.18.25 కోట్లు పోసింది. కుర్రాన్‌తో పాటు సికిందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వత్ కవెరప్ప, శివమ్ సింగ్, మోహిత్ రాతేలను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.. 

1011
Image credit: PTI

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ భిన్నమైన స్ట్రాటెజీతో వేలంలో దిగినట్టు కనిపించింది. ఎవ్వరూ వద్దనుకున్న కేన్ విలియంసన్‌, మోహిత్ శర్మలకు టీమ్‌లోకి పట్టుకొచ్చిన టైటాన్స్, శివమ్ మావి, కెఎస్ భరత్, జోషువా లిటిల్, వుర్విల్ పటేల్, ఓడియన్ స్మిత్‌లను కొనుగోలు చేసింది...

1111
Image credit: PTI

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌ స్ట్రాటెజీ ఎవ్వరికీ అర్థం కాలేదు. గత రెండు సీజన్లలో అట్టర్ ఫ్లాప్ అయిన నికోలస్ పూరన్‌కి రూ.16 కోట్లు పెట్టిన లక్నో, డానియల్ సామ్స్, రొమారియో షెఫర్డ్, జయ్‌దేవ్ ఉనద్కట్, నవీన్ వుల్ హక్, యష్ ఠాకూర్, యుద్‌వీర్ చరక్, స్వప్నిల్ సింగ్, ప్రెరక్ మన్కడ్, అమిత్ మిశ్రాలను వేలంలో కొనుగోలు చేసింది.. 

click me!

Recommended Stories