ఐపీఎల్ 2023 మినీ వేలం: కేన్ మామకి బేస్ ప్రైజ్... హారీ బ్రూక్‌కి బంపర్ ప్రైజ్! మయాంక్ మ్యాజిక్..

First Published Dec 23, 2022, 2:56 PM IST

ఐపీఎల్ 2023 మినీ వేలం ఘనంగా ప్రారంభమైంది. మినీ వేలంలో మొట్టమొదటిగా వేలానికి వచ్చిన ప్లేయర్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ రికార్డు క్రియేట్ చేశాడు. 

Image credit: Getty

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్‌ని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్.

Image credit: PTI

గత ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా రూ.14 కోట్లు తీసుకున్న కేన్ విలియంసన్, ఈ సీజన్‌లో రూ.2  కోట్లకు గుజరాత్ తరుపున ఆడబోతున్నాడు...

ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషన్ హారీ బ్రూక్ కోసం ఫ్రాంఛైజీలన్నీ పోటీపడ్డాయి. రూ.10 కోట్లు దాటిన తర్వాత రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు హారీ బ్రూక్ కోసం పోటీపడడంతో ధర అంతకంతకూ పెరుగుతూపోయింది. 

చివరికి రూ.13 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి హారీ బ్రూక్‌ని కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..  బ్రేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లతో మొదలైన హారీ బ్రూక్, దాదాపు 10 రెట్లు రెట్టింపు ధర దక్కించుకున్నాడు.

Image credit: PTI

భారత బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్‌ని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..  పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మయాంక్ కోసం పోటీపడ్డాయి. గత సీజన్‌లో రూ.12 కోట్లు తీసుకున్న మయాంక్, ఈ ఏడాది 8.25 కోట్లు తీసుకోబోతున్నాడు.

Image Credit: Getty Images

భారత టెస్టు ప్లేయర్ అజింకా రహానేని రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్‌ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు...

సౌతాఫ్రికా బ్యాటర్ రిలే రసో కూడా తొలి రౌండ్‌లో అమ్ముడుపోలేదు.. 

click me!