Heinrich Klaasen: 37 బంతుల్లోనే సెంచరీ.. యూసుఫ్ పఠాన్ రికార్డు సమం చేసిన హెన్రిచ్ క్లాసెన్

Published : May 25, 2025, 10:18 PM IST

Heinrich Klaasen: ఐపీఎల్ 2025లో హైన్రిచ్ క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. దీంతో యూసుఫ్ పఠాన్ 15 ఏళ్ల ఐపీఎల్ రికార్డును సమం చేశాడు. క్లాసెన్ సూపర్ సెంచరీ నాక్ తో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 278/3 పరుగులు చేసింది. 

PREV
15
హెన్రిచ్ క్లాసెన్ సునామీ బ్యాటింగ్

Heinrich Klaasen: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అద్భుతమైన ఆటతో పరుగుల వర్షం కురిపించారు. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ జట్టు సీజన్ చివరి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసింది. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ సెంచరీతో హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 278/3 పరుగులు చేసింది.

25
హెన్రిచ్ క్లాసెన్ సూపర్ సెంచరీ

KKR vs SRH మ్యాచ్ లో కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన బ్యాటింగ్ తో కేకేఆర్ బౌలింగ్ న దంచికొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. తన సెంచరీ ఇన్నింగ్స్ ( 105 పరుగులు) లో 7 ఫొర్లు, 9 సిక్సర్లు బాదాడు. తన కెరీర్ లో ఇది రెండో సెంచరీ. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. అలాగే, సన్ రైజర్స్ జట్టు తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ.

35
యూసుఫ్ పఠాన్ రికార్డును సమం చేసిన హెన్రిచ్ క్లాసెన్

కేకేఆర్ పై సెంచరీ కొట్టిన క్లాసెన్.. టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ యూసఫ్ పఠాన్ రికార్డును సమం చేశాడు. 15 సంవత్సరాల క్రితం యూసఫ్ పఠాన్ కూడా 37 బంతుల్లోనే ఐపీఎల్ లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు హెన్రిచ్ క్లాసెన్ కూడా 37 బంతుల్లో సెంచరీ కొట్టాడు.

45
ఐపీఎల్ లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన హెన్రిచ్ క్లాసెన్

క్లాసెన్ సాధించిన 37 బంతుల సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలో మూడవ వేగవంతమైన సెంచరీగా నిలిచింది. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కొట్టాడు. 2013లో గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. రెండో ఫాస్టెస్ట్ సెంచరీని ఐపీఎల్ 2025లో గుజరాత్‌పై ఆర్ఆర్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సాధించాడు. అతను కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు.

55
SRH భారీ స్కోరు: 278/3

హెన్రిచ్ క్లాసెన్ 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని సూపర్ నాక్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 278/3 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో మూడవ అత్యధిక జట్టు స్కోరు. హైదరాబాద్ టీమ్ గత సీజన్‌లోనే మొదటి, రెండవ అత్యధిక స్కోర్లను నమోదుచేసింది.

Read more Photos on
click me!

Recommended Stories