Ayush Mhatre: ఒకే ఓవ‌ర్ లో 2, 6, 6, 4, 4, 6, సీఎస్కే యంగ్ ప్లేయ‌ర్ విధ్వంసం

Published : May 25, 2025, 06:03 PM IST

Ayush Mhatre: చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) యంగ్ ప్లేయ‌ర్ అయుష్ మాత్రే గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. అద్భుత‌మైన బ్యాటింగ్ తో ఒకే ఓవ‌ర్ లో 28 పరుగులతో సునామీ రేపాడు. 

PREV
15
IPL 2025:చెన్నై సూపర్ కింగ్స్ vs గుజ‌రాత్ టైటాన్స్

Ayush Mhatre : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తుదిదశకు చేరుకుంది. ఈ మెగా లీగ్ లో 67వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్-గుజ‌రాత్ టైటాన్స్ త‌ల‌ప‌డ్డాయి. టాస్ గెలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

25
చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్

మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోర్ చేసింది. ధోని టీమ్ యంగ్ ప్లేయ‌ర్లు దుమ్మురేపే ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 230 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ టైటాన్స్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది.

35
ఒకే ఓవర్ లో 28 పరుగులు కొట్టిన ఆయూష్ మాత్రే

ఈ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ యంగ్ ప్లేయ‌ర్ ఆయూష్ మాత్రే ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప‌రుగుల వ‌ర్షం కురిపించాడు. ఒక్క ఓవర్‌లోనే 28 పరుగులతో దుమ్మురేపాడు. ఆదివారం (మే 24న) అహ్మ‌దాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎం.ఎస్. ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 17 ఏళ్ల అయుష్ మాత్రే ఓపెనర్‌గా దిగి ఆరంభం నుంచే గుజ‌రాత్ బౌలింగ్ ను దంచికొట్టాడు.

45
అర్షద్ ఖాన్ బౌలింగ్ ఉతికిపారేసిన ఆయూష్ మాత్రే

ఈ మ్యాచ్ రెండో ఓవర్‌లో గుజరాత్ తరఫున అర్షద్ ఖాన్ బౌలింగ్ చేయగా, ఆ ఓవర్‌లోనే అయుష్ మాత్రే 28 పరుగులు సాధించాడు. తొలి బంతికి 2 పరుగులు, రెండు, మూడో బంతుల‌ను వరుసగా రెండు సిక్సర్లు, నాలుగవ, ఐదవ బంతులకు వరుసగా రెండు ఫోర్లు, ఆఖరి బంతికి మరో సిక్సర్ బాదాడు. దీంతో మొత్తం 6 బంతుల్లో 28 పరుగులు సాధించి గుజరాత్ బౌలింగ్‌ను ఉతికిపారేశాడు.

55
ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో సీఎస్‌కేలో చేరిన ఆయుష్ మాత్రే

ఆయూష్ మాత్రే ఎక్కువ సేపు క్రీజులో కొనసాగలేదు. మొత్తంగా 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేసిన ఆయూష్ మాత్రేను ప్రసిద్ధ్ కృష్ణ‌ అద్భుతమైన డెలివరీతో ఔట్ చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో సీఎస్‌కేలో చేరిన ఆయూష్.. అద్భుత‌మైన ఆట‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. ః

ప్లేఆఫ్‌కు సీఎస్‌కే అర్హత సాధించలేకపోయినప్పటికీ, ఆయూష్ ప్రదర్శన ప్రశంసలు అందుకుంటోంది. గత ఐదు ఇన్నింగ్స్‌లలో ఆయూష్ చేసిన పరుగులు వరుసగా 32, 30, 94, 48, 34. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రే 94 పరుగులు చేసి 6 ప‌రుగుల దూరంలో సెంచరీ మిస్ అయ్యాడు.

Read more Photos on
click me!

Recommended Stories