Sourav Ganguly On Virat Kohli: గతకొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ త్వరలో జరుగనున్న ఆసియా కప్ తో మునపటి ఫామ్ ను అందుకుంటాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు.
మూడేండ్లుగా సెంచరీ కోసం ఎదురుచూస్తున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. గడిచిన ఏడాదికాలంగా క్రీజులో నిలవడానికే తంటాలు పడుతున్నాడు. సెంచరీ సంగతి పక్కనబెడితే కనీసం అర్థ సెంచరీ చేసినా చాలని అతడి అభిమానులు చూస్తున్నారు. మరోవైపు అతడి అధ్వాన్న ఫామ్, వరుసగా విరామాలు ఇవ్వడంపై విమర్శలు ఎదుర్కుంటున్నాడు.
27
Image credit: Getty
ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. కోహ్లీకి అండగా నిలిచాడు. ఈనెల 27 నుంచి ప్రారంభం కాబోయే ఆసియా కప్ లో మునపటి కోహ్లీని చూస్తామని, ఆ టోర్నీలో అతడు ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
37
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ.. ‘ముందు అతడిని ప్రాక్టీస్ చేయనివ్వండి. కోహ్లీ గొప్ప ఆటగాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో వేలాది పరుగులు చేశాడు. కోహ్లీ త్వరలోనే పుంజుకుంటాడు. సెంచరీలు చేయకపోవచ్చు.
47
కానీ ఆసియా కప్ లో మునపటి కోహ్లీని చూస్తాం. అతడు ఈ టోర్నీ ద్వారా పూర్వపు ఫామ్ ను అందుకుంటాడు. సెంచరీలు చేయకపోవచ్చు. కానీ తిరిగి పాత కోహ్లీని చూస్తామనే నమ్మకం నాకుంది..’ అని దాదా ఆశాభావం వ్యక్తం చేశాడు.
57
ఐపీఎల్ ముగిసిన తర్వాత వరుసగా విఫలమవుతున్న కోహ్లీ.. ఇంగ్లాండ్ తో సిరీస్ లో కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. దీంతో అతడిని వెస్టిండీస్ టూర్ కు కోహ్లీకి విశ్రాంతినిచ్చింది టీమిండియా. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తినా కోహ్లీ విరామం తీసుకున్నాడు. విరామం ముగించుకుని ఇటీవలే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.
67
ఇదిలాఉండగా.. కోహ్లీతో పాటు ఐసీసీ అధ్యక్ష పదవి, ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ పై కూడా దాదా కామెంట్స్ చేశాడు. తాను ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో లేనని, దానిపై బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాయని చెప్పాడు.
77
ఇక ఆసియాకప్ లో భాగంగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై దాదా స్పందిస్తూ.. అదేం పెద్ద ప్రత్యేకమైన మ్యాచ్ కాదని అన్నాడు. మిగతా మ్యాచ్ లను ఎలా చూస్తామో ఇండియా-పాక్ మ్యాచ్ ను కూడా తాను అలాగే చూస్తానని అన్నాడు. ఆసియా కప్ లో ఇండియా-పాక్ మధ్య ఈనెల 28న జరగనుంది.