దాయాదులు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. టీ20 వరల్డ్ కప్ 2022లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం 10 నెలల ముందు ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తే, 3 నిమిషాల్లోనే అన్నీ సేల్ అయిపోయాయి. భారత్, పాక్ మ్యాచ్ అంటే క్రేజ్ అలా ఉంటుంది...
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చూడాలంటే సెలబ్రిటీలైనా వెయిట్ చేయాల్సిందే. టికెట్ల కోసం తిప్పలు పడాల్సిందే. 2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో మొహాలీలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి టికెట్లు కావాల్సిందిగా హర్భజన్ సింగ్‌ని కోరాడట పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...
27
‘2011 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కి ముందు షోయబ్ అక్తర్ నన్ను కలిశాడు. నాకు చాలా టెన్షన్‌గా ఉంది, మ్యాచ్ గురించి కాదు, టికెట్లు దొరుకుతాయా? లేదా? అని... పాకిస్తాన్ నుంచి మా ఫ్యామిలీ మ్యాచ్ చూడడానికి వస్తోంది... అని చెప్పాడు...
37
నేను వెంటనే అతనికి టికెట్లు ఇప్పిస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు మరి ఫైనల్ మ్యాచ్‌కి కూడా టికెట్లు ఇప్పించవా? అని అక్తర్ అడిగాడు... ‘నువ్వు ముంబై వెళ్తున్నావా?’ అని అడిగా. ‘అవును... అక్కడే కదా ఫైనల్ జరిగేది...’ అని సమాధానం చెప్పాడు...
47
సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై గెలిచి, ఫైనల్ ఆడతామనే ధీమా... షోయబ్ అక్తర్ మాటల్లో కనిపించింది. నేను నవ్వేసి ఊరుకున్నాడు. ‘అతను ఎందుకు ఇంత నమ్మకంగా ఉన్నాడు...’ అని ఆశ్చర్యమేసింది...
57
తీరా చూస్తే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ ఆడడం లేదు. అతని దగ్గరికి వెళ్లి నీకోసం టికెట్ ఆరేంజ్ చేశానని చెప్పా... అయితే అది ఫైనల్ కోసం కాదు, లాహోర్‌కి తిరిగి వెళ్లడానికి...’ అంటూ ఛమత్కరించినట్టు చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్...
67
2011 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో విజయం అందుకుంది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, సచిన్ టెండూల్కర్ 85, సెహ్వాగ్ 38, సురేష్ రైనా 36 పరుగులతో రాణించడంతో 50 ఓవర్లలో 260/9 పరుగుల స్కోరు చేసింది....
77
లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 231 పరుగులకి ఆలౌట్ అయ్యింది. హర్భజన్ సింగ్ 10 ఓవర్లలో 43 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. సెమీస్‌లో పాక్‌ని ఓడించిన భారత జట్టు, అదే ఉత్సాహంతో ఫైనల్‌లో శ్రీలంకపై ఘన విజయం అందుకుని 2011 వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది..