ఆ దక్షిణాఫ్రికా బ్యాటర్ ను చూస్తే నాకు గుండప్ప విశ్వనాథ్ గుర్తుకొస్తున్నాడు : రవిశాస్త్రి

First Published Jan 16, 2022, 12:10 PM IST

Ravi Shastri comments On Keegan Petersen : టీమిండియాతో ఇటీవలే ముగిసిన టెస్టు సిరీస్ లో  దక్షిణాఫ్రికా యువ ఆటగాడు  పీటర్సన్ మెరుగైన  ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్ లో అతడు టాప్ స్కోరర్. 

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టుపై ముగిసిన టెస్టు సిరీస్ లో సఫారీలు  టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. అయితే  మూడో టెస్టులో ఆ జట్టు బ్యాటర్ కీగన్ పీటర్సన్ ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మూడో టెస్టులో తొలి ఇన్నింగ్సులో 72 పరుగులు చేసిన పీటర్సన్.. రెండో ఇన్నింగ్స్  లో కూడా రాణించాడు.  82 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను  విజయపథాన నడిపించాడు. 
 

ఇప్పుడు పీటర్సన్ ఆటను టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ప్రశంసల్లో ముంచెత్తాడు. సిరీస్ ఆసాంతం అతడు బాగా రాణించాడని శాస్త్రి కొనియాడాడు. 
 

ట్విట్టర్ వేదికగా స్పందించిన శాస్త్రి.. ‘కీగన్ పీటర్సన్ స్కిల్స్  అద్భుతం. అతడు ప్రపంచ స్థాయి ఆటగాడుగా తయారవుతున్నాడు. పీటర్పన్ ను చూస్తే నా చిన్ననాటి  హీరో గుండప్ప విశ్వనాథ్ గుర్తుకు వస్తున్నాడు.. ’అని ట్విట్ఱర్ లో పోస్టు చేశాడు. 

ఈ సిరీస్ కు ముందు రెండు టెస్టులే ఆడిన  పీటర్సన్.. భారత్ తో మెరుగైన ప్రదర్శన చేశాడు. అంతేగాక ఈ సిరీస్  లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఇక మూడో టెస్టులో భాగంగా భారత  రెండో ఇన్నింగ్సులో ఛతేశ్వర్ పుజారా ఇచ్చిన క్యాచ్ ను లెగ్ స్లిప్ లో పీటర్సన్ అందుకున్న  క్యాచ్.. మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. 
 

మూడు టెస్టులలో పీటర్సన్.. 276 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.  రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు విఫలమైన చోట  పీటర్సన్ రాణించాడు. ఇక మూడో టెస్టులో కూడా పీటర్సన్ కారణంగానే సఫారీలు సిరీస్ గెలిచారనడంలో సందేహం లేదు. 
 

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తన సహచరులంతా వచ్చినోళ్లు వచ్చినట్టే వెనుదిరుగుతుంటే పీటర్సన్ మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ముందు డీన్ ఎల్గర్ తో.. ఆ తర్వాత డసెన్ తో కలిసి భాగస్వామ్యాలు నిర్మించి సిరీస్ ను సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 
 

click me!