ఎమ్మెస్ ధోనీ అప్పుడే చెప్పాడు, అయినా బీసీసీఐ పట్టించుకోలేదు... విరాట్ టెస్టు కెప్టెన్సీ రిటైర్మెంట్‌పై...

Published : Jan 16, 2022, 12:02 PM IST

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ బలవంతంగా తప్పించినా... టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లీ సుదీర్ఘకాలం కెప్టెన్‌గా కొనసాగుతాడని భావించారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సడెన్‌గా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ...

PREV
113
ఎమ్మెస్ ధోనీ అప్పుడే చెప్పాడు, అయినా బీసీసీఐ పట్టించుకోలేదు... విరాట్  టెస్టు కెప్టెన్సీ రిటైర్మెంట్‌పై...

కేప్‌ టౌన్ టెస్టు పరాజయం తర్వాత ఒక్క రోజు గ్యాప్‌లోనే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

213

అదీకాకుండా భారత జట్టుకి మంచిది కాదనేది, తాను ఎప్పటికీ చేయనని తన కెప్టెన్సీ రిటైర్మెంట్ లేఖలో రాసుకురావడం పలు చర్చలకు దారి తీస్తోంది...

313

కేప్ టౌన్ టెస్టు మూడో రోజు డీన్ ఎల్గర్ వివాదాస్పద డీఆర్‌ఎస్ నిర్ణయం తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరుపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బీసీసీఐ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారని టాక్ వినబడుతోంది...

413

సెప్టెంబర్‌‌ వరకూ మూడు ఫార్మాట్లలో టీమిండియాకి కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ... ఆ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి, వన్డే కెప్టెన్సీ నుంచి, ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు...

513

2014లో మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత ఇలాగే టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ...

613

అదే టూర్‌లో ఆడిలైడ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొదటిసారిగా పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు విరాట్ కోహ్లీ. అప్పటికి ఏడో స్థానంలో ఉన్న భారత జట్టును, వరుసగా ఐదేళ్లు నెం.1 టీమ్‌గా నిలిపాడు...

713

భారత జట్టుకి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన విరాట్ కోహ్లీకి ఇలాంటి అనుభవం ఎదురుకావడానికి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ తీసుకున్న నిర్ణయమే కారణమంటున్నారు విశ్లేషకులు...

813

ఎప్పుడైతే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ భావించాడో, వన్డేల నుంచి కూడా తప్పించాలని భావించింది బీసీసీఐ. ఆ తర్వాత బీసీసీఐతో విభేదాలు, సఫారీ టూర్‌లో టెస్టు సిరీస్ వైఫల్యంతో టెస్టు కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది విరాట్ కోహ్లీ...

913

దీంతో 2017లో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...

1013

‘split కెప్టెన్సీ (భిన్నమైన ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లు) ఫార్ములా భారత జట్టుకి వర్కవుట్ కాదు. టీమిండియాకి ఒకే ఒక్క లీడర్ ఉండాలి. మిగిలిన దేశాల్లా భారత జట్టుకి ఈ వేర్వేరు కెప్టెన్ల ఫార్ములా సెట్ కాదు...

1113

టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి సరైన సమయం కోసం వేచి చూస్తూ వచ్చాను. విరాట్ కోహ్లీ ఈ బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటున్నా...

1213

అందులో ఎలాంటి తప్పు లేదు. మూడు ఫార్మాట్లలో అదరగొట్టగల సత్తా ఈ జట్టుకి ఉంది. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నా’ అంటూ కామెంట్ చేశాడు ఎమ్మెస్ ధోనీ...

1313

ఎమ్మెస్ ధోనీ చెప్పిన మాటలను విరాట్ కోహ్లీ కానీ, బీసీసీఐ కానీ సీరియస్‌గా తీసుకుని ఉంటే... ఇప్పుడు జట్టుకి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని అంటున్నారు మాహీ ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories