కోహ్లీలా కవర్ డ్రైవ్ ఆడకపోవచ్చు.. కానీ అత్యంత విలువైన ఆటగాడు.. మిస్టర్ 360 పై గంభీర్ ప్రశంసలు

First Published | Nov 4, 2022, 6:51 PM IST

టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్  సూర్యకుమార్ యాదవ్  ప్రస్తుతం  తన కెరీర్ లోనే అత్యద్భుత ఫామ్ లో ఉన్నాడు.  ఏడాదికాలంగా టీ20 ఫార్మాట్ లో  అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా  సూర్య కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు. 

గడచిన ఏడాదికాలంగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మిడిలార్డర్ బ్యాటర్, అభిమానులంతా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అని పిలుచుకునే సూర్యకుమార్ యాదవ్ పై  గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు.  టీమిండియాలో మిగతా బ్యాటర్ల మాదిరిగా  అత్యద్భుత కవర్ డ్రైవ్ లు ఆడకపోయినా అతడు అత్యంత విలువైన ఆటగాడు అని కొనియాడాడు. 

బంగ్లాదేశ్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత   గంభీర్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. ‘మీరు సూర్యకు మిస్టర్ 360 అనో మరింకేదో ట్యాగ్ లు తగిలించకండి. అతడిలో టన్నుల కొద్దీ ట్యాలెంట్ దాగుంది. అతడు 360 డిగ్రీస్ లో ఆడుతున్నాడా, 180 డిగ్రీస్, 1 డిగ్రీస్ లో ఆడుతున్నాడా అనేది అనవసరం. 
 

Latest Videos


సూర్య దేశవాళీలో  అన్ని ఫార్మాట్లలోనూ రాణించాడు. అతడిని టీ20లకే పరిమితం చేయకుండా టెస్టులలో కూడా ఆడించాలి. టెస్టులలో అవకాశమిస్తే  సూర్య ఆ ఫార్మాట్ లో కూడా  మెరుస్తాడు. సూర్య టీమిండియాలో అగ్రశ్రేణి బ్యాటర్లు ఆడినంత స్టైలిష్ గా కవర్ డ్రైవ్ లు ఆడలేడేమో గానీ అతడి స్ట్రైక్ రేట్ చూడండి. 
 

గత కొంతకాలంగా సూర్య స్ట్రైక్ రేట్ 180గా  ఉంది. అది నిలకడగా కొనసాగుతున్నది. ప్రస్తుతం టీమిండియాలో మరే ఇతర బ్యాటర్ కు అంత స్ట్రైక్ రేట్ లేదు. అదే అతడిని ఎంత విలువైన ఆటగాడో   సూచిస్తున్నది..’ అని తెలిపాడు. 

అయితే గంభీర్ తన కామెంట్స్ లో కోహ్లీ పేరు ప్రస్తావించకపోయినా అతడు కోహ్లీని ఉద్దేశించే ఈ కామెంట్లు చేశాడని అతడి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియాతో పాటు ఇతర జట్లలో కూడా కోహ్లీలా కవర్ డ్రైవ్ లు ఆడే ఆటగాళ్ల సంఖ్యను  వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు.  గంభీర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి సూర్య పై ప్రశంసలు కురిపించాడని వాళ్లు వాపోతున్నారు. 
 

సూర్యను పొగడటంలో తప్పులేదు గానీ అందులోకి అనవసరంగా కోహ్లీని లాగడమెందుకుని  గంభీర్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు.  గంభీర్ - కోహ్లీల  మధ్య విభేదాలు ఇప్పటివి కావని అందరికీ తెలిసిందే. ప్రతీసారి  ఏదో ఓ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వడం గంభీర్ కు అలవాటుగా మారిందని నెటిజన్లు కూడా చురకలంటిస్తున్నారు. 

click me!