‘కింగ్’ కోహ్లీ.. ఒక్క క్రికెటర్‌కి ఇన్ని రికార్డులా! సచిన్, ధోనీ వల్ల కానివి, చేసి చూపించిన విరాట్...

First Published | Nov 4, 2022, 5:03 PM IST

క్రికెట్ ప్రపంచంలో దేవుడిగా కీర్తించబడిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత, ఆయన క్రియేట్ చేసిన రికార్డులు ఛేదించడం ఎవ్వరితరం కాదనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఓ ‘రన్ మెషిన్’... సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డులే లక్ష్యంగా దూసుకొచ్చింది.. అత్యంత వేగంగా సెంచరీలు, హాఫ్ సెంచరీలు, వేల పరుగుల మైలురాళ్లు దాటుతూ దూసుకుపోతున్న ఆ మిస్సైల్ పేరు విరాట్ కోహ్లీ....

Virat Kohli

టీమిండియాలో రోహిత్ శర్మ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. మరి ఏంట్రా విరాట్ కోహ్లీ గొప్పతనం?.. ఇలా అనుకునేవారికి టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో పాకిస్తాన్‌పై ఆడిన ఒక్క ఇన్నింగ్స్ చాలు. వాళ్లు చేయలేనది, విరాట్ వల్ల మాత్రమే అయ్యేది ఏంటో అర్థమైపోతుంది..

Image credit: Getty

1990 దశాబ్దంలో పుట్టిన క్రికెట్ ఫ్యాన్స్‌కి దొరికిన మాహా అదృష్టం ఏంటంటే... అటు సచిన్ టెండూల్కర్, ఇటు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల ఆటను చూసే ఛాన్స్ దక్కడమే. అంతకుముందు పుట్టినవాళ్లు కూడా వీరి ఆటను చూస్తుంటారు. అయితే సచిన్ ఆటను చూస్తూ పెరిగి, ధోనీ ధనాధన్ ఆటను ఇష్టపడి, విరాట్‌కి అభిమానులుగా మారాలంటే మాత్రం 90ల్లో పుట్టినవాళ్లే అయ్యుండాలి... 


kohli

ఈ తరంలో ఫ్యాబులస్ 4గా విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్‌కి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. బాబర్ ఆజమ్ ఈ మధ్యే స్టార్ ప్లేయర్ల లీగులోకి దూసుకొచ్చినా... ఫ్యాబులస్‌ ప్లేయర్ల లిస్టులో చేరే ఇన్నింగ్స్‌లో ఇంకా అతని నుంచి రాలేదు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఫ్యాబ్ 4లో సత్తా చాటుతున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ...

Virat Kohli-Suryakumar Yadav

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, తుదిజట్టులోకి రావడం మిగిలిన ఆటగాళ్లు గాయపడాల్సిన దుస్థితికి చేరుకోగా జో రూట్‌కి అయితే వరల్డ్ కప్ టీమ్‌లోనే చోటు దక్కలేదు. కేన్ విలియంసన్, ఈ టోర్నీలోనూ న్యూజిలాండ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నా... అతని బ్యాటు నుంచి మొదటి నాలుగు మ్యాచుల్లో సరైన ఇన్నింగ్స్ కూడా రాలేదు...

తనతో పోటీపడినవాళ్లు, పోల్చబడినవాళ్లు పరుగులు చేయడానికి, టీమ్‌లో ప్లేస్ దక్కించుకోవడానికే కష్టపడుతున్న టైమ్‌లో... విరాట్ కోహ్లీ, టీమిండయాకి మ్యాచ్ విన్నర్‌గా మారాడు. నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసి, రెండు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచి... మూడోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ రేసులో నిలిచాడు.. 

Rohit lifts Kohli

అంతర్జాతీయ క్రికెట్‌లో 24 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండేళ్ల క్రితం దాకా ఏదో సరదాకి సెంచరీలు బాదుతున్నట్టుగా శతకాలు బాదుతూ పోయాడు... వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్‌లో ఆఫ్ఘాన్‌పై టీ20 సెంచరీ బాది... మొత్తంగా 71 అంతర్జాతీయ శతకాలు బాదాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు.

వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా 8 వేలు, 9000, 10,000, 11 వేల మైలురాయిని అందుకున్న క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే. 175 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు పూర్తిచేసుకున్న కోహ్లీ, 222 ఇన్నింగ్స్‌లో 11 వేల మైలురాయిని అందుకున్నాడు. 

ఒక దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్ కోహ్లీ. ఈ ఫీట్‌తో ఐసీసీ ‘దశాబ్దపు క్రికెటర్’గా అవార్డు గెలిచాడు... 2016 ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఐదు సీజన్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది.

2019 వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ అందుకున్న మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు టీ20 వరల్డ్‌కప్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీయే. గత ఆరు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు. 

Image credit: PTI

ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ... టెస్టుల్లో ఏడో స్థానంలో ఉన్న భారత జట్టును నెం.1 టీమ్‌గా నిలిపాడు. అతి తక్కువ కాలంలో అత్యధిక విజయాలు (40 టెస్టు విజయాలు) అందించిన భారత కెప్టెన్ విరాట్... బీసీసీఐతో విభేదాలతో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Image credit: PTI

వన్డేల్లో విరాట్ కోహ్లీ చేసిన 43 సెంచరీల్లో 26 శతకాలు చేధనలో చేసినవి. వన్డే ఫార్మాట్‌లోనే ఇది ఓ రికార్డు. సచిన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సెంచరీలు చేస్తే, విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ శతకాలు నమోదుచేశాడు. 2008 నుంచి ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు, అత్యధిక హాఫ్ సెంచరీలు, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు గెలిచిన క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే.

Latest Videos

click me!