ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్ వంటి ప్లేయర్లు టెస్టుల్లో, డేవిడ్ వార్నర్, బట్లర్, ఆరోన్ ఫించ్, బాబర్ ఆజమ్ వంటి ప్లేయర్లు వన్డే, టీ20 ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తుంటే... విరాట్ కోహ్లీ ఒక్కడే ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మూడు ఫార్మాట్లలోనూ రికార్డుల మోత మోగించాడు...