అతను టీ20లకు అస్సలు పనికి రాడు, ఎవ్వరూ అలాంటి ప్లేయర్‌ను తీసుకోరు... సంజయ్ మంజ్రేకర్ కామెంట్...

First Published Oct 14, 2021, 3:23 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌‌లో ఆఖరాట మాత్రమే మిగిలి ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీతో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో కేకేఆర్, ఆఖరి ఓవర్‌లో విజయాన్ని అందుకుంది...

విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన స్థితిలో బౌలింగ్‌కి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, మొదటి నాలుగు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు..

షకీబుల్ హసన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా, సునీల్ నరైన్ భారీ షాట్‌కి ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే అశ్విన్ హ్యాట్రిక్ బంతికి భారీ సిక్సర్ కొట్టిన రాహుల్ త్రిపాఠి, మ్యాచ్‌ను ముగించేశాడు...

అయితే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో నితీశ్ రాణా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రవిచంద్రన్ అశ్విన్ నేలజారవిడిచాడు... పెద్దగా కదలాల్సిన అవసరం కూడా లేకుండా, చేతుల్లోకి వచ్చిన బంతిని క్యాచ్ అందుకోలేకపోయాడు...

‘అశ్విన్ గురించి చెప్పాలంటే అతను పర్ఫెక్ట్ టెస్టు బౌలర్. టీ20ల్లో మాత్రం అతను సెట్ కాడు. పొట్టి ఫార్మాట్‌కి అశ్విన్ స్టైల్ పనికి రాదు... ఎందుకంటే వేగంగా సాగే మ్యాచుల్లో అతను జట్టుకి కావాల్సిన ఫోర్స్‌ను నింపలేడు...

అశ్విన్‌ని టీ20 ఫార్మాట్‌కి తగ్గట్టుగా మార్చాలని ప్రయత్నించినా, ఆ ప్రయోగం పెద్దగా సక్సెస్ కాకపోవచ్చు. ఎందుకంటే గత ఐదారేళ్లు అతను ఇలాగే ఆడుతున్నాడు.. టెస్టుల్లో అతనో అద్భుతమైన బౌలర్...

అలాంటి బౌలర్‌ను ఇంగ్లాండ్ సిరీస్‌లో ఒక్క టెస్టు కూడా ఆడించలేదు. అలాంటిది ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా టీ20ల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదేమో... నేనైతే అశ్విన్ లాంటి ప్లేయర్‌ను నా టీమ్‌లో ఆడించాలని అనుకోను...

స్పిన్ పిచ్‌లైతే అశ్విన్ స్థానంలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, లేదా యజ్వేంద్ర చాహాల్‌ను ఆడిస్తే.. వాళ్లు మ్యాచ్ గెలవడానికి అవసరమైన వికెట్లు తీస్తారు...’ అంటూ కామెంట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, కేవలం 7 వికెట్లు పడగొట్టి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేసిన భారత జట్టులో అశ్విన్‌కి చోటు దక్కింది...

click me!