‘ఈ మ్యాచులు చూస్తుంటే మెంటల్ ఎక్కుతోంది...’ ఐపీఎల్ 2021 సీజన్‌పై కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...

Published : Oct 14, 2021, 01:54 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ రుచి చూపించింది. రికార్డు స్థాయిలో సూపర్ ఓవర్ మ్యాచులు, ఆఖరి లీగ్ మ్యాచ్ వరకూ ప్లేఆఫ్స్ బెర్తులపై కొనసాగిన ఉత్కంఠ... ఈసారి ఐపీఎల్ 2021లో ఆ రేంజ్‌లో డ్రామా లేకపోయినా, మ్యాచులు మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీలను తలపిస్తున్నాయి...

PREV
19
‘ఈ మ్యాచులు చూస్తుంటే మెంటల్ ఎక్కుతోంది...’ ఐపీఎల్ 2021 సీజన్‌పై కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో పూర్తి వన్‌ సైడెడ్‌గా సాగిన మ్యాచులు చాలా తక్కువ. ఈజీగా గెలుస్తారని భావించిన లో స్కోరింగ్ గేమ్స్ కూడా ఆఖరి ఓవర్, ఆఖరి బంతి దాకా వెళ్లి, క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేశాయి...

29

ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్... 20వ ఓవర్ ఆఖరి బంతికి ఫలితం తేలగా, మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్, రెండో క్వాలిఫైయర్ మ్యాచుల్లోనూ ఈ విధమైన ఉత్కంఠ కొనసాగింది... 

39

ఈ మూడు మ్యాచుల్లోనూ 19.4, 19.4, 19.5 ఓవర్లలో మ్యాచ్ ఫలితం వచ్చింది. కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్ అయితే వేరే లెవల్. 24 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉన్న కేకేఆర్, ఆ తర్వాత 22 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయింది...

49

ఏకంగా నలుగురు వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండానే డకౌట్లుగా పెవిలియన్ చేరారంటే, మ్యాచ్ ఏ విధంగా మలుపు తిరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాహుల్ త్రిపాఠి స్ట్రైయిక్ తీసుకుని, సిక్సర్ కొట్టాడు కానీ లేదంటే సీన్ రివర్స అయ్యేదే...

59

‘ఐపీఎల్‌ను నేను చాలా క్లోజ్‌గా ఫాలో అవుతున్నా... అయితే ఈ సీజన్ చాలా ప్రత్యేకమైనది. ఈసారి చాలా మంది యంగ్ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఫైనల్ దాకా రాకపోయినా చాలామంది సత్తా ఉన్న కుర్రాళ్లు ఈ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చారు...

69

కుర్రాళ్లు కుమ్మేస్తుంటే, ఎంతో అనుభవం ఉన్న సీనియర్లు, స్టార్లు మాత్రం ఫెయిల్ అవుతున్నారు. అందుకే ఈ సీజన్‌లో కొన్ని దారుణమైన ముగింపులు, మలుపులను చూడడానికి అవకాశం దొరికింది...

79

నా వరకూ ఇదో మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ ఐపీఎల్ సీజన్. ఈ మ్యాచులు చూస్తుంటే మెంటల్ ఎక్కుతోంది. ఈ మ్యాచులు ఇలా జరగడానికి కారణం పిచ్‌లు. యూఏఈ పిచ్‌లు బౌలర్లకు చక్కగా సహకరిస్తున్నాయి. అందుకే మ్యాచ్ చివరికి వచ్చేసరికి బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు...

89

ఐపీఎల్ అంటే భారీ సిక్సర్లు, బౌండరీలు, పెద్ద స్కోర్లు ఆశిస్తాం. కానీ ఈసారి అలా జరగలేదు. ప్రారంభంలో ఇలాంటి లో స్కోరింగ్ గేమ్స్ ఉంటే ఓకే, కానీ ఫైనల్‌కి వచ్చిన తర్వాత కూడా ఇలా లో స్కోరింగ్ మ్యాచులు జరిగితే చూడడానికి ఏ మాత్రం బాగుండదు...

99

ఐపీఎల్ ఈసారి ప్లాప్ అయ్యిందనే నా ఉద్దేశం. ఇలాంటి మ్యాచులు చూడడానికి చాలా సహనం కావాలి. ఐపీఎల్ ఫ్యాన్స్‌, భారీ స్కోరింగ్ మ్యాచులకే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు...’ అంటూ కామెంట్ చేశాడు కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...

click me!

Recommended Stories