ఐపీఎల్ (IPL) అంటేనే ధనాధన్ ఆట. మూడు నాలుగు గంటల్లోనే ఫలితం తేలే ఈ ధనాధన్ లీగ్ లో ఆడాలంటే టెస్టు ప్లేయర్లు పనికిరారనే ముద్ర పడిపోయింది. ఇందులో భాగంగానే భారత్ టెస్టు ప్లేయర్ గా ముద్ర పడిపోయిన చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే లను ఆడించడానికి ఏ ఐపీఎల్ జట్టూ ముందుకురాదు.