అతను మిస్టరీ స్పిన్నర్ కాదు, తనకంటే కుల్దీప్ యాదవ్ చాలా బెటర్...

Published : Jul 31, 2021, 03:41 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, అందరి దృష్టినీ ఆకర్షించాడు వరుణ్ చక్రవర్తి. ఈ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన ఈ మిస్టరీ స్పిన్నర్‌ ప్రదర్శన ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని అంటున్నారు లంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, పాక్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా...

PREV
114
అతను మిస్టరీ స్పిన్నర్ కాదు, తనకంటే కుల్దీప్ యాదవ్ చాలా బెటర్...

‘టీ20 సిరీస్‌లో భారత జట్టు బౌలింగ్ చూస్తే వరుణ్ చక్రవర్తి కంటే రాహుల్ చాహార్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అతను మిస్టరీ స్పిన్నర్ అన్నారు, కానీ అతనే ఒకే పేస్‌తో బౌలింగ్ చేస్తూ, ఎలాంటి వెరైటీ చూపించలేకపోయాడు...

214
అతని బౌలింగ్ యాక్షన్ చాలా సాధారణంగా కనిపించింది. అలాంటి బౌలింగ్ యాక్షన్ ఉంటే, ఏ బాల్ వేయబోతున్నాడో బ్యాట్స్‌మెన్ ఈజీగా అంచనా వేసేస్తారు. అతనికి ఇంకా చాలా అనుభవం అవసరం...

314
జట్టు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోని, అవసరానికి తగ్గట్టుగా బౌలింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. స్పిన్నర్లు రాణిస్తే, ఏ మ్యాచ్ అయినా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది...
జట్టు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోని, అవసరానికి తగ్గట్టుగా బౌలింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. స్పిన్నర్లు రాణిస్తే, ఏ మ్యాచ్ అయినా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది...
414

లంక స్పిన్నర్లు రాణించినంతగా భారత స్పిన్నర్లు రాణించలేకపోయారు. అందుకే భారత జట్టు చివరి రెండు టీ20ల్లో విజయం సాధించలేకపోయింది...

514

వరుణ్ చక్రవర్తి కంటే కుల్దీప్ యాదవ్ చాలా బెటర్... అతనికి అవకాశాలు ఇవ్వాలి...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా...

614

శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కూడా వరుణ్ చక్రవర్తి కంటే కుల్దీప్ యాదవ్‌కి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించాలని కామెంట్ చేశాడు..

714

‘ఐపీఎల్‌ 2021 యూఏఈలో జరుగుతుండడంతో ఎవరు ఫామ్‌లో ఉన్నారో, ఎవరు లేరో అక్కడే తేలనుంది. వరుణ్ చక్రవర్తి కంటే కుల్దీప్ యాదవ్ బెటర‌ని నా ఉద్దేశం..

814
ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఇప్పటికే తనని తాను నిరూపించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతనికి ఐపీఎల్‌లో పెద్దగా అవకాశాలు రావడం లేదు...
ఎందుకంటే కుల్దీప్ యాదవ్ ఇప్పటికే తనని తాను నిరూపించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతనికి ఐపీఎల్‌లో పెద్దగా అవకాశాలు రావడం లేదు...
914
వరుణ్ చక్రవర్తి మంచి బౌలర్, ఐపీఎల్ టీమ్‌కే కాకుండా టీమిండియాకి కూడా అతను రాణించగలడు. అయితే అతను ఇంకా అజంతా మెండీస్, సునీల్ నరైన్ స్థాయికైతే చేరుకోలేదు...
వరుణ్ చక్రవర్తి మంచి బౌలర్, ఐపీఎల్ టీమ్‌కే కాకుండా టీమిండియాకి కూడా అతను రాణించగలడు. అయితే అతను ఇంకా అజంతా మెండీస్, సునీల్ నరైన్ స్థాయికైతే చేరుకోలేదు...
1014
మెండీస్ కానీ, నరైన్ కానీ జట్టులోకి వచ్చిన కొత్తలో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టేవాళ్లు. అలాంటి బౌలింగ్ వరుణ్ చక్రవర్తిలో కనిపించడం లేదు. దానికి ఇంకా సమయం పడుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్...

1114
ఐపీఎల్ 2020 సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన వరుణ్ చక్రవర్తి, 17 వికెట్లు తీసి కేకేఆర్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో జరిగిన ఏడు మ్యాచుల్లో ఏడు వికెట్లు తీశారు వరుణ్ చక్రవర్తి...

1214

2020 ఆస్ట్రేలియా టూర్‌లో టీ20 సిరీస్‌కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి, గాయం కారణంగా తప్పుకున్నాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన నటరాజన్, ఆసీస్ టూర్‌లో అదరగొట్టాడు...

1314
ఇంగ్లాండ్, ఇండియా వన్డే, టీ20 సిరీస్‌కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి, ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాలేక జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
ఇంగ్లాండ్, ఇండియా వన్డే, టీ20 సిరీస్‌కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి, ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాలేక జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
1414

ఎట్టకేలకు శ్రీలంక టూర్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి, ఐపీఎల్ 2020 సీజన్‌లో కరోనా బారిన పడిన మొట్టమొదటి ప్లేయర్. స్కానింగ్ కోసం బయో బబుల్ దాటి బయటికి వెళ్లిన వరుణ్ చక్రవర్తి, ఆ విషయాన్ని దాచిపెట్టి కేకేఆర్ టీమ్‌లో కరోనా కేసులు రావడానికి కారణమయ్యాడు.

click me!

Recommended Stories