టీమిండియా ఓటమికి ఆ ముగ్గురే కారణం... రెస్ట్ కావాలంటే ఐపీఎల్ టైమ్‌లో ఎందుకు తీసుకోరు...

First Published Nov 26, 2022, 6:36 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత వారం గ్యాప్ తీసుకుని న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడుతోంది టీమిండియా. వర్షం, లక్ కలిసి రావడంతో టీ20 సిరీస్‌ని 1-0 తేడాతో సొంతం చేసుకుంది భారత జట్టు. అయితే తొలి వన్డేలో మాత్రం 7 వికెట్ల తేడతో చిత్తుగా ఓడింది టీమిండియా...

శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించినా చివర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించి 307 పరుగుల భారీ స్కోరు అందించినా టామ్ లాథమ్ భారీ సెంచరీ, కేన్ విలియంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌కి ఘన విజయం అందించారు...

పూర్తి స్థాయి భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ ఏడాది కాలంలో కెప్టెన్సీ చేసింది ఆరు వన్డేలకు మాత్రమే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో మూడు, ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడింది టీమిండియా...

Virat Kohli-Rohit Sharma

పార్ట్ టైమ్ కెప్టెన్లు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో 7 వన్డేలు ఆడిన భారత జట్టు, మరో రెండు వన్డేలు ఆడనుంది. అలాగే వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఇప్పటికే ఆరు వన్డేలు ఆడింది భారత జట్టు... కెప్టెన్ అయ్యాక రెండు వన్డే సిరీస్‌లకు కెప్టెన్సీ చేసిన రోహిత్.. ఐదు సిరీస్‌లకు దూరమయ్యాడు...

‘శ్రీలంక, ఇంగ్లాండ్ వంటి జట్లను చూడండి. వాళ్లు ఆఫ్ఘాన్‌తో జరిగే మ్యాచుల్లో కూడా కెప్టెన్‌నీ, ప్లేయర్లను మార్చరు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు కూడా అంతే. అలాంటిది టీమిండియా విషయంలో మాత్రం ఇన్ని మార్పులు ఎందుకు...

విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, మహ్మద్ షమీ వంటి సీనియర్ ప్లేయర్లకు కూడా వరుసగా రెస్ట్ ఇస్తున్నారు. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో సగం మ్యాచులకు దూరం పెడుతున్నారు. రెండు, మూడు మ్యాచులు ఆడగానే అలిసిపోయే ప్లేయర్ల, రెండు నెలల పాటు ఐపీఎల్ ఎలా ఆడుతున్నారు...

Image credit: Getty

మీకు మరీ అంత రెస్ట్ కావాలనుకుంటే ఐపీఎల్ సమయంలో బ్రేక్ తీసుకోండి.. ఒకే కోచ్, ఒకే కెప్టెన్ ఉంటే జట్టు పటిష్టంగా తయారవుతుంది. సిరీస్‌కో కెప్టెన్, ప్లేయర్లను మారుస్తూ పోతే... టీమిండియా ప్రదర్శన ఇంతకంటే మెరుగ్గా ఎలా ఉంటుంది...

Image credit: PTI

న్యూజిలాండ్‌ పర్యటనలో శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఉన్నాడు, బంగ్లాదేశ్ టూర్‌కి వెళ్లేసరికి కెప్టెన్ మారిపోతాడు. ఓపెనర్లు మారిపోతారు. హెడ్ కోచ్ కూడా మారిపోతాడు. ఇలాంటి ప్రయోగాలు టీమ్‌కి ఏ మాత్రం మంచివి కావు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
 

click me!