మాహీ అలా మాట్లాడాల్సింది కాదు, జడేజా చాలా బాధపడ్డాడు... జడ్డూ, ఐపీఎల్ 2022ను వీడడానికి...

First Published May 17, 2022, 4:53 PM IST

ఐపీఎల్‌లో స్టార్లుగా ఎదిగిన క్రికెటర్లలో రవీంద్ర జడేజా ఒకడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని 2008 అండర్ 19 వరల్డ్ కప్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న జడ్డూ, ఐపీఎల్‌లో 14 సీజన్లు  ఆడిన ప్లేయర్లలో ఒకడు.  బ్యాన్ కారణంగా ఓ సీజన్ ఆడలేకపోయిన జడ్డూ, ఐపీఎల్ కెరీర్‌లో 2022 సీజన్‌ అంతకంటే పెద్ద అలజడులే సృష్టించింది...

గత నాలుగేళ్లుగా భారత జట్టు తరుపున మూడు ఫార్మాట్లు ఆడుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో ఒకడైన రవీంద్ర జడేజా, 2022 సీజన్ ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు...

Ravindra Jadeja

మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవాలని ఆశపడిన జడ్డూ, ఆ కోరిక త్వరగానే నెరవేరినందుకు చాలా సంతోషించాడు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు...

Latest Videos


వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన తర్వాత తొలి విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, 8 మ్యాచులు ముగిసిన తర్వాత రెండే విజయాలు అందుకోవడంతో సీజన్ మధ్యలో కెప్టెన్‌ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది...

రవీంద్ర జడేజా స్థానంలో తిరిగి ఎమ్మెస్ ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జడ్డూ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు మాహీ...

జడ్డూకి ప్రతీదీ స్పూన్ ఫీడింగ్‌లా నేర్పించాల్సి ఉంటుందని, ప్రతీ చిన్న విషయానికి నా మీద ఆధారపడితే నేనేం చేయగలనని మాహీ చేసిన కామెంట్లు... జడ్డూని బాధపెట్టాయంట...

‘అవును, సీఎస్‌కే మేనేజ్‌మెంట్, ఎమ్మెస్ ధోనీ వ్యవహరించిన విధానంతో రవీంద్ర జడేజా చాలా ఫీల్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఏదీ అతనికి కలిసి రాలేదు. అయితే కెప్టెన్‌ని మార్చాలనుకుంటే దీన్ని మరింత బెటర్‌గా డీల్ చేయవచ్చు...

జడేజా గాయపడిన విషయం వాస్తవమే, అయితే ఆ గాయం తీవ్రత ఎంత అనేది ఇప్పుడే చెప్పలేను. నాకు తెలిసినంత వరకూ అతని శరీరానికి అయిన గాయం కంటే, మనసు అయిన గాయం చాలా పెద్దది. 

మాహీ అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఓన్లీ పేపర్ కెప్టెన్‌గా ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. సక్సెస్‌లో క్రెడిట్ తీసుకుని, పరాజయాల్లో మాత్రం కెప్టెన్సీ లోపమని చెబితే తట్టుకోగలరా...’ అంటూ కామెంట్ చేశాడు జడేజా సన్నిహితుడు...

click me!