మాట మార్చిన అజారుద్దీన్... చేతకాదని చేతులెత్తేసి, ఇప్పుడు కేటీఆర్‌కి మద్ధతు... ఐపీఎల్ నిర్వహించే సత్తా ఉందంటూ

First Published Mar 1, 2021, 2:44 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచుల వేదికల షార్ట్ లిస్టులో హైదరాబాద్‌ లేకపోవడం భాగ్యనగరవాసులకు షాక్‌కి గురి చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబై, ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించేందుకు కూడా మొగ్గుచూపిన బీసీసీఐ... హైదరాబాద్‌ను మాత్రం ఐపీఎల్ నిర్వహించేందుకు డిసైడ్ చేసిన షార్ట్ లిస్టు వేదికల నుంచి తొలగించింది.

ఐపీఎల్ 2021 సీజన్ వేదికగా హైదరాబాద్‌ను షార్ట్ లిస్టు చేయకపోవడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యం జరిపిన చర్యలే కారణం. కరోనా నిబంధనలకు అనుగుణంగా బయో సెక్యూలర్ జోన్ ఏర్పాటు చేసి మ్యాచులు నిర్వహించడం తమ వల్ల కాదని, హెచ్‌సీఏ చేతులు ఎత్తేసిందట...
undefined
దాంతో ముంబైతో సహా చెన్నై, కోల్‌కత్తా, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్‌ మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ యాజమాన్యం. అయితే ఈ నిర్ణయంపై హైదరాబాద్‌వాసులు అసంతృప్తి వ్యక్తం చేసుకున్నారు.
undefined
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించాలంటూ బీసీసీఐని, ఐపీఎల్ యాజమాన్యాన్ని బహిరంగంగా విజ్ఞప్తి చేశాడు. భారత్‌లోని మిగిలిన మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం అన్నిరకాలుగా మద్ధతు ఇస్తుందని తెలిపాడు.
undefined
కేటీఆర్ ఎంట్రీతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మాట మార్చాడు... ‘కేటీఆర్ విజ్ఞప్తికి నేను పూర్తిగా మద్ధతు ఇస్తున్నా... బీసీసీఐ బయో సెక్యూర్ బబుల్ నిబంధనలకు అనుగుణంగా ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు హైదరాబాద్‌ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయి...’ అంటూ ట్వీట్ చేశాడు మహ్మద్ అజారుద్దీన్...
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తెలుగు ప్లేయర్లను తీసుకోకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు అజారుద్దీన్. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఏకంగా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచులు జరగనీయమని, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో హైదరాబాద్ పేరును తొలగించాలని కూడా డిమాండ్ చేశాడు...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌ నిర్వహణకి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ సుముఖంగా లేకపోవడం వల్లే ముంబైలో ఖాళీ స్టేడియాల్లో అయినా మ్యాచులు నిర్వహించాలని నిర్ణయించుకుంది బీసీసీఐ. షార్ట్ లిస్టు నుంచి హైదరాబాద్‌ను తొలగించిన తర్వాత మంత్రిగారి దృష్టిలో పడేందుకే హెచ్‌సీఏ అధ్యక్షుడు ఇలా మాట మార్చాడని అంటున్నారు నెటిజన్లు...
undefined
బయో సెక్యూలర్ జోన్‌లో మ్యాచులు నిర్వహించే సత్తా ఉన్నప్పుడు ఆ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యంతో జరిగిన చర్చల్లోనే గట్టిగా చెప్పి ఉండొచ్చు కదా... అప్పుడు చేతకాదని చేతులు ఎత్తేసి, ఇప్పుడు షార్ట్ లిస్టులో నుంచి పేరు తొలగించాక విమర్శలు వస్తున్నాయని ఇలా చేయగలమని చెప్పడంలో ఉద్దేశం ఏంటని నిలదీస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
undefined
click me!