హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచులు పెట్టండి... బీసీసీఐకి కేటీఆర్ స్పెషల్ రిక్వెస్ట్...

First Published Mar 1, 2021, 9:37 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ నిర్వహణ కోసం షార్ట్ లిస్టు చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్ పేరు గల్లంతైన విషయం తెలిసిందే. కరోనా ఉన్న ముంబైలో ప్రేక్షకులు లేకుండా మ్యాచులు నిర్వహించేందుకు మొగ్గుచూపిన ఐపీఎల్ యాజమాన్యం, హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) చేతులు ఎత్తేయడంతో హైదరాబాద్‌ను జాబితా నుంచి తొలగించింది...

అయితే క్రికెట్ ప్రేమికుడైన తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు, ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన క్రికెట్ మ్యాచులను హైదరాబాద్‌లోనూ నిర్వహించాల్సిందిగా బీసీసీఐని విజ్ఞప్తి చేశాడు...
undefined
తొలుత కేవలం ముంబై, పూణె నగరాల్లో మాత్రమే ఐపీఎల్ గ్రూప్ మ్యాచులు నిర్వహించి, ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచులను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని భావించింది బీసీసీఐ. అయితే కరోనా ఎక్కువగా ఉన్న నగరాల్లో మ్యాచులు నిర్వహించడం కంటే, ముఖ్యనగరాల్లో మ్యాచులు నిర్వహిస్తేనే బెటర్‌ అనే నిర్ణయానికి వచ్చారు బీసీసీఐ అధికారులు.
undefined
ప్రేక్షకులు లేకుండా ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచులు నిర్వహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ముంబైలో మ్యాచులు నిర్వహించేందుకు నిర్ణయించుకున్న ఐపీఎల్ యాజమాన్యం, హైదరాబాద్‌ను మాత్రం షార్ట్ లిస్టు నుంచి తొలగించింది.
undefined
కరోనా నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్‌లో మ్యాచులు నిర్వహించడం తమ వల్ల కాదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) చేతులు ఎత్తేయడం వల్లే ఐపీఎల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కేటీఆర్ మాత్రం ఇక్కడ మ్యాచులు పెట్టాలని కోరడం విశేషం..
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో తెలుగు ప్లేయర్లు లేరని హెచ్‌సీఏ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అసహనం వ్యక్తం చేయడం, దానం నాగేందర్ వంటి రాజకీయ నాయకులు, హైదరాబాద్‌లో మ్యాచులు జరగనీయమని హెచ్చరించడం కూడా షార్ట్ లిస్టు నుంచి హైదరాబాద్‌ తొలగించడానికి కారణం కావచ్చు...
undefined
‘వచ్చే ఐపీఎల్ సీజన్‌ వేదికగా హైదరాబాద్‌ను చేర్చాలని బీసీసీఐని, ఐపీఎల్ యాజమాన్యాన్ని బహిరంగంగా కోరుతున్నాను. మేం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా హైదరాబాద్‌లో మిగిలిన మెట్రో నగరాల కంటే చాలా తక్కువ కోవిద్ కేసులు నమోదవుతున్నాయి. మా ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుంది’ అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపాడు మంత్రి కేటీఆర్...
undefined
కేవలం ఆరు నగరాలనే షార్ట్ లిస్టు చేయడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు కూడా అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబై నగరాల్లో మ్యాచులు నిర్వహించడం ఆయా ప్రాంతీయ జట్లకు అవకాశాలు పెరుగుతాయని అంటున్నాయి ఫ్రాంఛైజీలు.
undefined
click me!