ఒకే దెబ్బకు రెండు పిట్టలు... ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టు టీమిండియా గెలిస్తే చాలు...

First Published Mar 1, 2021, 10:51 AM IST

టీమిండియా ముందు ఓ బంపర్ అవకాశం నిలిచింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లింది. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోరుకి అర్హత సాధిస్తుంది టీమిండియా.

ఆఖరి టెస్టులో గెలిస్తే... భారత జట్టుకి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకు సొంతం అవుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్, టీమిండియా రెండు జట్లూ కూడా 118 పాయింట్లతో ఉన్నాయి.
undefined
అయితే టాప్‌లో ఉన్న న్యూజిలాండ్‌ 27 మ్యాచులు ఆడితే, టీమిండియా 32 మ్యాచులు ఆడడంతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇంగ్లాండ్‌తో జరిగే నాలుగో టెస్టు ఫలితం భారత జట్టును టాప్ ర్యాంకులో నిలబెడుతుంది...
undefined
ఆఖరి టెస్టులో గెలిస్తే భారత జట్టు మళ్లీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి వెళుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు దరిదాపుల్లో లేకపోవడంతో ఆఖరి టెస్టులో విజయం సాధిస్తే... భారత జట్టు ముందు అద్భుత అవకాశాలు నిలుస్తాయి.
undefined
లార్డ్ వేదికగా జరిగే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తే... ఐసీసీ మొదటి టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌తో పాటు పాయింట్ల పట్టికలో మిగిలిన జట్లకి అందనంత ఎత్తులో నిలిచే అవకాశం ఉంటుంది...
undefined
అలాగే వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న టీమిండియా, టాప్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ను ఓడించి సిరీస్ సొంతం చేసుకుంటే... అందులో కూడా టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ 123 పాయింట్లతో టాప్‌లో ఉంటే, టీమిండియా 117 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. టీమిండియా టాప్‌లోకి దూసుకెళ్లాలంటే వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది.....
undefined
టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఇంగ్లాండ్ 275 పాయింట్లతో ఉంటే, ఆస్ట్రేలియా 272 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న భారత జట్టు ఖాతాలో 268 పాయింట్లు ఉన్నాయి...
undefined
టెస్టు సిరీస్ తర్వాత జరిగే ఐదు మ్యాచులు టీ20 సిరీస్ గెలిస్తే భారత జట్టు ఏకంగా టాప్‌లోకి దూసుకెళ్లొచ్చు. అయితే భారత జట్టు టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి వెళ్లాలంటే 5-0, లేదా 4-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.
undefined
click me!