హార్ధిక్ పాండ్యాకి హ్యాట్సాఫ్! తిట్టేవాళ్లను చూశా కానీ ఇలా... - రవిచంద్రన్ అశ్విన్..

Published : Mar 22, 2023, 06:45 PM IST

అవకాశం వస్తే మూడు ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతారు క్రికెటర్లు. అయితే హార్ధిక్ పాండ్యా మాత్రం వైట్ బాల్ క్రికెట్‌కే పరిమితం అవ్వాలని అనుకుంటున్నాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాండ్యాని ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించినా... అందుకు తాను తగనని చెప్పేశాడు టీ20 కెప్టెన్...

PREV
16
హార్ధిక్ పాండ్యాకి హ్యాట్సాఫ్! తిట్టేవాళ్లను చూశా కానీ ఇలా... - రవిచంద్రన్ అశ్విన్..
Hardik Pandya Test

2018 ఆగస్టులో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన హార్ధిక్ పాండ్యా, వెన్ను గాయం కారణంగా సుదీర్ఘ ఫార్మాట్‌కి దూరంగా ఉంటున్నాడు. ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో సరైన టెస్టు ఆల్‌రౌండర్‌ కోసం వెతుకుతున్న హార్ధిక్ పాండ్యాని ఆడించడమే కరెక్ట్ అని భావిస్తోంది...

26

‘లేదు. నేను ఇప్పట్లో టెస్టులు ఆడాలని అనుకోవడం లేదు. విలువలకు ప్రాధాన్యం ఇచ్చే మనిషిని. టెస్టుల్లో ఆడేందుకు 10 శాతం కూడా అర్హుడిని కాదు. నేను టెస్టుల్లో వేరొకరి ప్లేస్‌ని తీసుకోవడం కరెక్ట్ కాదు. టెస్టుల్లో ఆడాలనుకుంటే, నా స్థానాన్ని నేను దక్కించుకుంటాను..  నాకు ఆ అర్హత వచ్చిందని అనుకునేదాకా టెస్టుల్లో ఆడను...’ అంటూ కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా...

36
Steve Smith-Hardik Pandya

‘వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించగానే చాలామంది హార్ధిక్ పాండ్యా టెస్టుల్లోకి రీఎంట్రీ ఇస్తాడని అనకున్నారు..  ఇంగ్లాండ్‌లో హార్ధిక్ పాండ్యాకి మంచి రికార్డు ఉంది. అయితే హార్ధిక్ పాండ్యా చెప్పిన మాటలు విన్నాక నాకు చాలా గర్వంగా అనిపించింది...

46
Hardik Pandya

నేను ఆ పొజిషన్‌కి అర్హుడిని కాను, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు ఒక్క శాతం కూడా అర్హత సాధించలేదని హార్ధిక్ పాండ్యా కామెంట్ చేశాడు. ఓ క్రికెటర్ నుంచి రావాల్సిన గొప్ప స్టేట్‌మెంట్ అది. హార్ధిక్ పాండ్యా చెప్పిన మాటలు, భావి తరాలకు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తాయి...

56

మన ఫెయిల్యూర్లకు వేరే వాళ్లను నిందించడం, తిట్టడం చాలా మంది చేస్తారు. వంకలు వెతకడానికి, వేరే కారణాలు చెప్పడానికి చూస్తాం. కానీ చోటు కావాలంటే అర్హత కావాలని హార్ధిక్ పాండ్యా మాటలకు హ్యాట్సాఫ్... అలాంటి ప్లేయర్, నిజమైన మ్యాచ్ విన్నర్...

66

రోహిత్ శర్మ గైర్హజరీతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో హార్ధిక్ పాండ్యా టీమ్‌ని నడిపించిన విధానం అద్భుతం. హార్ధిక్ ఎలాంటి ఛాలెంజ్ తీసుకోవడానికైనా వెనకాడడు. సిరాజ్, షమీలను పాండ్యా వాడిన విధానం సూపర్...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్...

click me!

Recommended Stories