వన్డే వరల్డ్ కప్‌లోనూ యజ్వేంద్ర చాహాల్‌కి చోటు డౌటేనా... రాహుల్ ద్రావిడ్ కామెంట్లను బట్టి చూస్తే...

First Published Mar 22, 2023, 5:30 PM IST

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియాకి నాలుగేళ్ల పాటు ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు యజ్వేంద్ర చాహాల్. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక చాహాల్‌కి బ్యాడ్ టైమ్ మొదలైంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎంత బాగా ఆడినా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి యజ్వేంద్ర చాహాల్‌ని సెలక్ట్ చేయలేదు సెలక్టర్లు...
 

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి యజ్వేంద్ర చాహాల్‌ని ఎంపిక చేసినా, అతను టోర్నీ మొత్తం రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్ ఆల్‌రౌండర్ల రాకతో యజ్వేంద్ర చాహాల్ పూర్తిగా రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు...
 

Sanju Samson and Chahal

కుల్దీప్ యాదవ్ వన్డే, టీ20ల్లో కాకపోతే టెస్టుల్లో కూడా ఆడగలడు. అయితే యజ్వేంద్ర చాహాల్ ఇప్పటిదాకా టెస్టు ఆరంగ్రేటం కూడా చేయలేదు. మరి యజ్వేంద్ర చాహాల్ ఫ్యూచర్ ఏంటి? అతని కెరీర్ ముగిసినట్టేనా...

Image credit: Getty

‘ఇండియాలో పిచ్‌లు స్పిన్నర్లకు చక్కగా సహకరిస్తాయి. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన గత రెండు మ్యాచుల్లో అలాంటి పిచ్‌లు కనిపించలేదు. అయితే వరల్డ్ కప్‌లో టీమిండియా ఎలాంటి పిచ్, పరిస్థితుల్లో ఆడబోతుందో మాకు పూర్తి క్లారిటీ ఉంది..
 

Image credit: PTI

లీగ్ స్టేజీలో 9 నగరాల్లో మ్యాచులు జరుగుతాయి. అక్టోబర్‌లో గాలిలో తేమ, వాతావరణం కూడా స్పిన్నర్లకు చక్కగా సహకరిస్తుంది. ఏప్రిల్‌లో ఐపీఎల్‌లో ఉండే పరిస్థితులు, అక్టోబర్‌‌లో ఉండవు. కాబట్టి ఐపీఎల్ పర్ఫామెన్స్‌ ఆధారంగా టీమ్‌ని డిసైడ్ చేయాలని అనుకోవడం లేదు...

Chahal with Dravid

ప్రతీ టీమ్‌కి బేస్‌ చాలా అవసరం. మణికట్టు స్పిన్నర్ ఉంటే టీమ్‌కి చాలా పెద్ద బలం దొరుకుతుంది. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయాల్సిన బాధ్యత స్పిన్నర్లదే. మణికట్టు స్పిన్నర్ అటాకింగ్ బౌలింగ్‌తో కచ్చితంగా వికెట్లు రాబట్టగలడు...

Image credit: PTI

అందుకే కుల్దీప్ యాదవ్‌ని వరుసగా ఆడిస్తున్నాం. యజ్వేంద్ర చాహాల్ చాలా మంచి స్పిన్నర్ అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పిన్ ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం పెరిగింది. అందకు యజ్వేంద్ర చాహాల్ రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సి వస్తోంది...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...

Chahal

రాహుల్ ద్రావిడ్ కామెంట్లను బట్టి చూస్తే యజ్వేంద్ర చాహాల్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో కూడా చోటు దక్కడం అనుమానమే. ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున బరిలో దిగబోతున్న యజ్వేంద్ర చాహాల్, అక్కడ కూడా అశ్విన్‌తో పోటీపడబోతున్నాడు..  

click me!