లెక్కలు కూడా చాలా విషయాలు దాస్తాయి... రోహిత్ కంటే దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్ టాప్...

First Published Jul 31, 2022, 7:16 PM IST

రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతోంది టీమిండియా. వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, టీ20 సిరీస్‌ని కూడా విజయంతో ఆరంభించింది. తొలి టీ20లో 68 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది భారత జట్టు..

Image credit: Getty

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి శుభారంభం అందించినా మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా తీవ్రంగా నిరాశపరిచారు...

Image credit: PTI

అయితే దినేశ్ కార్తీక్ ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో 190 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది టీమిండియా. భారత స్పిన్నర్లు అశ్విన్, రవి భిష్ణోయ్, జడేజా కారణంగా వరుస వికెట్లు కోల్పోయిన విండీస్‌ 122 పరుగులకి పరిమితమైంది...

Rajkot: Indian batsman Dinesh Karthik celebrates after scoring a half century during the 4th T20 cricket match between India and South Africa, at Saurashtra Cricket Association Stadium, in Rajkot, Friday, June 17, 2022. (PTI PhotoKunal Patil)(PTI06_17_2022_000258B)

‘దినేశ్ కార్తీక్ పర్ఫామెన్స్ టాప్ క్లాస్. తొలి టీ20లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి ఎక్కువ పరుగులు చేసినా దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్ చాలా స్పెషల్. ఎందుకంటే కొన్ని సార్లు లెక్కల్లో కూడా తెలియకుండా కొన్ని విషయాలు దాగి ఉంటాయి..

Image credit: PTI

రోహిత్ శర్మ బ్రిలియెంట్‌గా బ్యాటింగ్ చేశాడు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే రోహిత్ శర్మ అవుటైనప్పుడు భారత జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది... కీలక సమయంలో అతను అవుట్ అయ్యాడు...

Image credit: PTI

కష్టాల్లో పడిన టీమిండియాని ఆదుకున్నాడు దినేశ్ కార్తీక్. అతను క్రీజులో ఉన్నంతసేపు ఏదైనా సాధ్యమే. దినేశ్ కార్తీక్ చాలా స్పెషల్ ప్లేయర్. అతనిలో చాలా క్రికెట్ మిగిలే ఉంది...

అతను ఇప్పుడు ది బెస్ట్ ఫినిషర్. అతని పనైపోయిందనుకున్న ప్రతీసారీ వచ్చి తన విలువేంటో, తానేం చేయగలడో చూపిస్తున్నాడు.. ప్రపంచంలో నెం.6 ప్లేస్‌ని స్పెషల్ పొజిషన్‌గా మార్చేశాడు కార్తీక్...

Dinesh Karthik

అతను 19 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైయిక్ రేటు 215. అదీకాకుండా ఈ మ్యాచ్‌లో అతను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా... 

click me!