టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. నాలుగేళ్లుగా టీమ్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్‌ని పక్కనబెట్టి వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్‌లకు అవకాశం ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది...
ఐపీఎల్‌లో మిస్టరీ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న వరుణ్ చక్రవర్తి, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ పర్పామెన్స్ ఇచ్చి... ఆ తర్వాత జట్టులో చోటు కూడా కోల్పోయాడు...
28
Rahul Chahar-Virat Kohli
యజ్వేంద్ర చాహాల్ కంటే వేగంగా బౌలింగ్ చేస్తాడనే ఉద్దేశంతో టీ20 వరల్డ్ కప్ టోర్నీలో చోటు దక్కించుకున్న రాహుల్ చాహార్, ప్రపంచకప్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు...
38
వెన్నెముక సర్జరీ తర్వాత రెండేళ్లుగా బౌలింగ్ చేయలేకపోతున్న ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి టీ20 వరల్డ్ కప్ 2021 జట్టులో చోటు కల్పించడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది...
48
టీ20 వరల్డ్ కప్ 2021 అనుభవాలతో పొట్టి ప్రపంచకప్ 2022 టోర్నీకి సరైన టీమ్‌ని ఎంపిక చేయాల్సిందిగా, అవసరమైతే తన సలహాను తీసుకోవాల్సిందిగా బీసీసీఐ ఛీఫ్ సెలక్టర్ ఛేతన్ శర్మకు వార్నింగ్ ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్...
58
‘ఛేతన్ శర్మ నాతో కలిసి చాలా మ్యాచులు ఆడాడు... ఏ ఛేతూ ఈసారి సరైన టీమ్‌ని సెలక్ట్ చేయి. సలహా కావాలంటే నాకు ఫోన్ చెయ్యి... లేదా రవిశాస్త్రికి ఫోన్ చెయయి... మేం మీకు మంచి గైడెన్స్ ఇస్తాం... ’ అంటూ కామెంట్ చేశాడు క్రిష్ శ్రీకాంత్...
68
Image credit: Getty
‘టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ట్రయల్ అండ్ ఎర్రర్ పద్దతిలో కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఎవరెవరు ఏయే రోల్స్ పోషించగలరో టెస్టు చేస్తున్నారు. అందులో తప్పేమీ లేదు...
78
అయితే ఆసియా కప్ నుంచి సీనియర్లు అందరూ ఆడాలి. సరైన టీమ్ కాంబినేషన్‌ని సెట్ చేయాల్సి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు కృష్ణమాచారి శ్రీకాంత్...
88
Kris Srikkanth
1983లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న కృష్ణమాచారి శ్రీకాంత్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన సమయంలో టీమిండియాకి ఛీఫ్ సెలక్టర్‌గా ఉన్నాడు..