అక్కడ అదరగొట్టిన టీమిండియా కెప్టెన్... బిగ్‌బాష్‌‌ లీగ్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌తో...

First Published Nov 25, 2021, 9:43 AM IST

భారత మహిళా జట్టు టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ నుంచి సరైన ఇన్నింగ్స్‌ చూసి చాలా రోజులైంది. వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్... వరుసగా హాఫ్ సెంచరీలు బాదుతూ కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో రికార్డుల వర్షం కురిపిస్తుంటే... పొట్టి ఫార్మాట్ కెప్టెన్ మాత్రం ఫామ్ అందుకోవడానికి తెగ కష్టపడుతూ ఉండింది. అయితే వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్... చెలరేగిపోయింది...

అటు బ్యాటుతో, ఇటు బాల్‌తో రాణించి, వుమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ కైవసం చేసుకుంది. బ్యాటుుతో 399 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్, బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టింది. 

బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా 8వ స్థానంలో నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్, అత్యధిక పరుగులు చేసిన భారతీయురాలిగా ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ 12 మ్యాచుల్లో 11 ఇన్నింగ్స్2ల్లో 66.50 సగటుతో 399 పరుగులు చేసింది...

భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 13 మ్యాచుల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో 377 పరుగులు చేసి, హర్మన్‌ప్రీత్ కౌర్ తర్వాతి స్థానంలో నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ 12 మ్యాచుల్లో 317 పరుగులతో టాప్ 12లో నిలిచింది...

‘ఇలాంటి అవకాశం కోసం మేం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. త్వరలోనే వుమెన్ ఐపీఎల్ మొదలవుతుందని ఆశిస్తున్నాం. వుమెన్ ఐపీఎల్ మొదలైతే, విదేశీ ప్లేయర్లతో కలిసి ఆడి, వారి అనుభవాన్ని డొమిస్టిక్ ప్లేయర్లకు అందించే అవకాశం దొరుకుతుంది...’ అంటూ కామెంట్ చేసింది హర్మన్‌ప్రీత్ కౌర్...

ఇంతకుముందు ఇంగ్లాండ్‌లో జరిగిన ‘ది సూపర్ లీగ్’లో పాల్గొన్న హర్మన్ ప్రీత్ కౌర్, వుమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో కూడా ఆడింది. ఈ రెండు టోర్నీల్లో ఆడిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలిచింది హర్మ‌న్‌ప్రీత్...

‘ఈ అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని మరింత పెంచుతుంది. వుమెన్ బిగ్‌‌బాష్ లీగ్‌, మహిళా క్రికెటర్లకు దొరికిన  అరుదైన వేదిక. ప్రతీ భారత క్రికెటర్, ఇలాంటి టోర్నీల్లో ఆడాలని కోరుకుంటారు... నాకు అవకాశం రావడం ఆనందంగా ఉంది... 

‘భారతీయులిగా ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నమెంట్ గెలవడం గర్వంగా ఉంది. ఈ అవార్డు, భారత్‌ వుమెన్ క్రికెటర్లకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది... ’ అంటూ చెప్పుకొచ్చింది హర్మన్‌ప్రీత్ కౌర్...

click me!