2022 వన్డే టీమ్ ఆఫ్ ఇయర్‌ని ప్రకటించిన ఐసీసీ.. టీమిండియా నుంచి ఆ ఇద్దరికీ అవకాశం...

First Published Jan 24, 2023, 1:02 PM IST

సోమవారం టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022 జట్టును ప్రకటించిన ఐసీసీ, తాజాగా వన్డే టీమ్‌ని ప్రకటించింది. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ కారణంగా ఐసీసీ టీ20 టీమ్‌లో ముగ్గురు భారతీయులు (విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా) చోటు దక్కించుకుంటే  వన్డే టీమ్‌లో మాత్రం ఇద్దరు భారత ప్లేయర్లకి చోటు దక్కింది...

Babar Azam

ఈ ఏడాది వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా కొనసాగుతున్న బాబర్ ఆజమ్‌ని టీ20 టీమ్ కెప్టెన్‌గా ఎంచుకుంది ఐసీసీ. ఈ ఏడాది 84.87 సగటుతో వన్డేల్లో 679 పరుగులు చేశాడు బాబర్ ఆజమ్. గత ఏడాది 9 వన్డేలు ఆడిన పాకిస్తాన్, ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది...

Travis Head

ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిడ్ హెడ్, గత ఏడాది 68.75 సగటుతో 550 పరుగులు చేసి, ఐసీసీ వన్డే టీమ్‌లో ఓపెనర్‌గా చోటు దక్కించుకున్నాడు. 112.24 స్ట్రైయిక్ రేటుతో గత ఏడాది రెండు సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు ఆసీస్ బ్యాట్స్‌మెన్...

shai hope

వెస్టిండీస్ బ్యాటర్ షై హోప్, గత ఏడాది వన్డేల్లో 709 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన హై హోప్‌, ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022 టోర్నీలో వన్‌ డౌన్ ప్లేయర్‌గా చోటు సంపాదించుకున్నాడు..

Image credit: PTI

భారత్ నుంచి ఐసీసీ వన్డే టీమ్‌లో చోటు దక్కించుకున్న బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. గత ఏడాది వన్డేల్లో 55.69 సగటుతో 724 పరుగులు చేశాడు శ్రేయాస్ అయ్యర్. ఇందులో ఓ సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
 

Mehidy Hasan Miraz

న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ లాథమ్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్‌లకు ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022 టీమ్‌లో చోటు దక్కింది...

Image credit: PTI

వీరితో పాటు వెస్టిండీస్ బౌలర్ అల్జెరీ జోసఫ్‌తో పాటు భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కి ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022లో చోటు దక్కింది. గత ఏడాది జస్ప్రిత్ బుమ్రా గాయంతో ఎక్కువ మ్యాచులకి దూరం కావడంతో భారత జట్టుకి ప్రధాన పేసర్‌గా మారిన సిరాజ్.. 15 మ్యాచులు ఆడి 24 వికెట్లు తీశాడు. 4.62 ఎకానమీతో బౌలింగ్ చేసి అదరగొట్టాడు...

Image credit: Getty

న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌తో పాటు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాకి ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023లో చోటు దక్కింది. ట్రెంట్ బౌల్ట్ గత ఏడాది 6 వన్డేల్లో 18 వికెట్లు పడగొట్టగా ఆడమ్ జంపా, 2022లో 12 మ్యాచుల్లో ఏకంగా 30 వికెట్లు తీసి అదరగొట్టాడు..
 

Image credit: PTI

ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022: బాబర్ ఆజమ్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, షై హోప్, శ్రేయాస్ అయ్యర్, టామ్ లాథమ్, సికిందర్ రజా, మెహిదీ హసన్ మిరాజ్, అల్జెరీ జోసఫ్, మహ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా

click me!