ఆ రోజు నా కెరీర్‌లోనే చాలా స్పెషల్... పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ని గుర్తు చేసుకున్న విరాట్ కోహ్లీ...

First Published Nov 26, 2022, 1:28 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరలేకపోయింది. అయితే విరాట్ కోహ్లీ అభిమానులకు మాత్రం ఓ స్పెషల్ టోర్నీగా మిగిలిపోయింది. కారణం మూడేళ్లుగా సెంచరీ చేయడం లేదని ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన విరాట్ కోహ్లీ, పొట్టి ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 4 హాఫ్ సెంచరీలతో 296 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. అంతకుముందు ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై సెంచరీ చేసినా... టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ వేరే లెవెల్..

Image credit: Getty

160 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టు, 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారీ అంచనాలు పెట్టుకున్న కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు అక్షర్ పటేల్ కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈ దశలో హార్ధిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు విరాట్ కోహ్లీ...

Ashwin-Virat Kohli

హార్ధిక్ పాండ్యా 37 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి అవుటైనా 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ... కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో మెప్పించి, ఒంటిచేత్తో భారత జట్టుకి అద్భుత విజయాన్ని అందించాడు...

virat kohli

టీమిండియా విజయానికి ఆఖరి 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో పాక్ స్టార్ బౌలర్ హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు విరాట్ కోహ్లీ. ఐసీసీ వరల్డ్ కప్ 2022 టోర్నీకే ఈ సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి...

‘అక్టోబర్ 23, 2022 రోజుకి నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇంతకుముందెప్పుడూ ఈ గేమ్‌లో ఉన్నంత ఎనర్జీని ఫీల్ అవ్వలేదు. ఆ సాయంత్రం చాలా స్పెషల్...’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ...

Image credit: Getty

పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌కి నెల రోజులు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా నిర్వహించారు అభిమానులు..

click me!