విరాట్ కోహ్లీ ప్లేస్‌ని భర్తీ చేసే సత్తా శ్రేయాస్ అయ్యర్‌కి ఉందా... కేకేఆర్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

First Published Nov 26, 2022, 11:58 AM IST

రోహిత్ శర్మ రిటైర్ అయితే ఆ ప్లేస్‌ని భర్తీ చేయడానికి పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దేవ్‌దత్ పడిక్కల్ వంటి కుర్రాళ్లు చాలామందే రిజర్వు బెంచ్‌లో ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ రిటైర్ అయితే కీలకమైన మూడో స్థానంలో నిలబడగల ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ ఆడని మ్యాచుల్లో వన్‌డౌన్‌లో వచ్చే శ్రేయాస్ అయ్యర్ ఆ పని చేయగలడా?

Shreyas Iyer

2017లో టీమిండియాలోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఇప్పటిదాకా 47 టీ20లు, 32 వన్డేలు, 5 టెస్టు మ్యాచులు ఆడాడు. నాలుగో స్థానంలో అనేక మంది ప్లేయర్లను మార్చిన తర్వాత శ్రేయాస్ అయ్యర్‌ని ఫిక్స్ చేసింది టీమిండియా...

Image credit: PTI

అయితే  సూర్యకుమార్ యాదవ్ వచ్చిన తర్వాత టీ20ల్లో నాలుగో స్థానానికి కరెక్ట్ ప్లేయర్‌గా నిరూపించుకున్నాడు. అందుకే 2021లో ఎంట్రీ ఇచ్చిన సూర్య, ఇప్పటికే 41 టీ20లు ఆడితే, అయ్యర్ ఐదేళ్లుగా 47 మ్యాచుల దగ్గరే ఆగిపోయాడు...

Sanju Samson-Shreyas Iyer

మరి విరాట్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా శ్రేయాస్ అయ్యర్‌కి ఉందా? ఈ ప్రశ్నకి ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు అయ్యర్. ‘నేను ఎప్పుడూ పాజిటివ్ మైండ్‌సెట్‌తోనే ఉంటాను. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించి, బుర్ర పాడుచేసుకోవడం నాకు అస్సలు నచ్చదు...

Image credit: PTI

ఇప్పుడు నా చేతుల్లో ఏది ఉందో దాని గురించే మాత్రమే ఆలోచిస్తా. ట్రైయినింగ్, ప్రాక్టీస్, మ్యాచ్.. ఇక్కడివరకే. నా ఫిట్‌నెస్ లెవెల్స్‌ని కాపాడుకోవడంపై శ్రద్ధ పెడతా. నా మైండ్‌సెట్ ఇదే. ఎందుకంటే భారత జట్టులోకి ప్లేయర్లు వస్తూ పోతూ ఉంటారు.

virat kohli shreyas iyer

అయితే టీమిండియాలో మనకంటూ ఓ ముద్ర వేసుకోవడం ముఖ్యం. నిలకడైన ప్రదర్శన ఇవ్వగలిగితేనే ఇది సాధ్యమవుతుంది. విరాట్ కోహ్లీ భయ్యా ఇన్నేళ్లుగా అదే చేశాడు, చేస్తున్నాడు... ఆయన స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలికైన విషయం కాదు...

Image credit: PTI

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతీ ఒక్కరి కెరీర్‌లో ఎత్తూ పల్లాలు ఉంటాయి. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నాకు నేను ధైర్యం చెప్పుకుంటా. బయటి వాళ్ల మాటలు వినకండా ఓ చెవిటి చెవిని మెయింటైన్ చేస్తుంటా...’ అంటూ కామెంట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...
 

న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్, మొదటి వన్డేలో వన్‌డౌన్‌లో వచ్చి 76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు.. 

click me!