ఐర్లాండ్‌ బ్యాటర్‌కి బ్యాట్ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా... ఇంకా ఎక్కువ సిక్సర్లు బాది, ఐపీఎల్‌కి రావాలని...

Published : Jun 27, 2022, 03:12 PM IST

టీ20 కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా కెరీర్ ఘన విజయంతో మొదలైంది. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది భారత జట్టు. హారీ టెక్టర్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 

PREV
16
ఐర్లాండ్‌ బ్యాటర్‌కి బ్యాట్ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా... ఇంకా ఎక్కువ సిక్సర్లు బాది, ఐపీఎల్‌కి రావాలని...

తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ఒకానొక దశలో 4 ఓవర్లు ముగిసే సరికి 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్, హారీ టెక్టర్ సునామీ హాఫ్ సెంచరీ కారణంగా భారీ స్కోరు చేయగలిగింది...

26

36

టీ20ల్లో కెప్టెన్‌గా వికెట్ తీసిన మొట్టమొదటి భారత సారథిగా రికార్డు క్రియేట్ చేసిన హార్ధిక్ పాండ్యా, 12 బంతుల్లో 24 పరుగులు చేయడంతో 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది భారత జట్టు..

46

భారత సీనియర్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో ఈజీగా పరుగులు రాబట్టిన 22 ఏళ్ల హారీ టెక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

56

‘అతను చాలా అద్భతుమైన షాట్స్ ఆడాడు. హారీ టెక్టర్ వయసు 22 ఏళ్లు మాత్రమే తెలిసి షాక్ అయ్యా. అతనికి నా బ్యాట్ ఇచ్చాను. ఆ బ్యాటుతో అతను మరిన్ని సిక్సర్లు బాది, ఐపీఎల్‌ కాంట్రాక్ట్ దక్కించుకుంటాడని ఆశిస్తున్నా... ఆల్ ది బెస్ట్...’ అంటూ తెలిపాడు హార్ధిక్ పాండ్యా...

66
Harry Tector

2018 అండర్ 19 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన హారీ టెక్టర్, నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 101 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో ఐర్లాండ్ ఆ మ్యాచ్‌లో 288 పరుగులు చేయగలిగింది...

click me!

Recommended Stories