టీ20 వరల్డ్ కప్ 2022లో ఈ నలుగురి ప్లేస్ కన్ఫార్మ్ అయినట్టేనా... అందుకే ఐర్లాండ్‌తో సిరీస్‌లోనూ...

Published : Jun 27, 2022, 01:11 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఘోర పరాభవం నుంచి ఇంకా పూర్తిగా తేలుకోకముందే ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతోంది భారత జట్టు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టులో భారీ మార్పులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

PREV
19
టీ20 వరల్డ్ కప్ 2022లో ఈ నలుగురి ప్లేస్ కన్ఫార్మ్ అయినట్టేనా... అందుకే ఐర్లాండ్‌తో సిరీస్‌లోనూ...
Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు నుంచి టీమిండియా తరుపున అత్యధిక మ్యాచులు ఆడిన భారత బౌలర్‌గా టాప్‌లో ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. 2021 నుంచి 21 మ్యాచులు ఆడిన భువీ 23 వికెట్లు పడగొట్టి 6.7 ఎకానమీతో బౌలింగ్ చేశాడు...

29
Image credit: PTI

సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ, 2021 వరల్డ్ కప్ తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో మహ్మద్ షమీని కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం చేసి... భువీని పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగించాలని టీమిండియా భావిస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

39

ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన తర్వాత కూడా భువనేశ్వర్ కుమార్‌ని ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి కొనసాగించింది బీసీసీఐ. అతని బౌలింగ్‌ రిథమ్ మిస్ కాకుండా చూసేందుకే భువీని వరుస టోర్నీల్లో ఆడిస్తున్నట్టు సమాచారం... 

49

జస్ప్రిత్ బుమ్రా, టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండడం పక్కా. కాబట్టి భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా ఓపెనింగ్ స్పెల్ వేస్తే డెత్ ఓవర్లలో ఆ భారం హర్షల్ పటేల్ తీసుకోబోతున్నాడు. 2021 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఆరంగ్రేటం చేసిన హర్షల్ పటేల్, ఇప్పటిదాకా 13 మ్యాచులు ఆడాడు...

59
Harshal Patel

13 మ్యాచుల్లో 18 వికెట్లు తీసిన హర్షల్ పటేల్, 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ 7 వికెట్లు తీసి, టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు హర్షల్ పటేల్...

69

కారణాలేమైనా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆడలేకపోయాడు భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్. అయితే ఈసారి మాత్రం చాహాల్ పేరు, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే జట్టులో ఉండడం పక్కాగా మారింది...

79
Image credit: PTI

ఎందుకంటే 2021 వరల్డ్ కప్ తర్వాత 14 మ్యాచులు ఆడిన చాహాల్, 15 వికెట్లు తీశాడు. 7.8 ఎకానమీతో బౌలింగ్ చేసిన యజ్వేంద్ర చాహాల్, టీ20 ఫార్మాట్‌లో 75 అంతర్జాతీయ వికెట్లు తీసి... అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు...

89
Ishan Kishan

వీరితో పాటు ఇషాన్ కిషన్ కూడా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత చాలా మెరుగ్గా ఆడుతున్నాడు. ఈ ఏడాది 400+ పరుగులు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలిచిన ఇషాన్ కిషన్, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు...

99

దీంతో ఎలా చూసుకున్నా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యజ్వేంద్ర చాహాల్, ఇషాన్ కిషన్... ఈ నలుగురు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడబోతున్నారని... ఎవరి పేర్లు ఉన్నా లేకపోయినా ఈ నలుగురు మాత్రం పొట్టి ప్రపంచకప్ ఆడతారని చెబుతున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 

click me!

Recommended Stories