ఐపీఎల్‌ పేరు మారింది, టైటిల్ స్పాన్సర్‌గా టాటా... చైనా మొబైల్ కంపెనీ వీవో ప్లేస్‌లో...

Published : Jan 11, 2022, 02:47 PM ISTUpdated : Feb 03, 2022, 07:37 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ నుంచి ఆటతో పాటు పేరు కూడా మారనుంది. వచ్చే సీజన్‌లో అదనంగా రెండు కొత్త జట్లు వస్తుండడంతో 10 ఫ్రాంఛైజీలతో ఆట సాగనుంది. అలాగే ఇప్పుడు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ కూడా మారింది...

PREV
110
ఐపీఎల్‌ పేరు మారింది, టైటిల్ స్పాన్సర్‌గా టాటా... చైనా మొబైల్ కంపెనీ వీవో ప్లేస్‌లో...

ఐపీఎల్ 2016 నుంచి ఇండియన్ ప్రీమియ్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది చైనా మొబైల్ కంపెనీ ‘వీవో’... అయితే 2020లో కొన్ని కారణాల వల్ల వీవో ప్లేస్‌లో ‘డ్రీమ్ 11’ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది...

210

అయితే వచ్చే సీజన్‌లో చైనా మొబైల్ కంపెనీ ‘వీవో’కి బదులుగా భారత దిగ్గజ కంపెనీ ‘టాటా’ ఐపీఎల్‌కి టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించబోతుంది...

310

‘చైనా మొబైల్ తయారీ సంస్థ వీవో ప్లేస్‌లో టాటా గ్రూప్, ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది... ఇకపై వీవో ఐపీఎల్‌  ‘టాటా ఐపీఎల్’గా మారుతుంది...’ అంటూ తెలిపాడు ఐపీఎల్ ఛైర్మెన్ బ్రిజేష్ పటేల్...

410

2008లో ఐపీఎల్ ఆరంగ్రేటం చేసినప్పుడు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది ‘డీఎల్‌ఎఫ్’ కంపెనీ. మొదట ఐపీఎల్ సీజన్‌ కోసం రూ.40 కోట్లు చెల్లించి, టైటిల్ స్పాన్సర్‌షిప్ దక్కించుకుంది...

510

ఆ తర్వాతి ఏడాది రూ.48 కోట్లు, 2010లో రూ. 42 కోట్లు, 2011లో రూ.60 కోట్లు, 2012లో 70 కోట్లు చెల్లించి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది డీఎల్‌ఎఫ్...

610

ఆ తర్వాత మూడేళ్ల పాటు కూల్‌ డ్రింక్ కంపెనీ ‘పెప్సీ’ ఐపీఎల్‌కి టైటిల్ స్పాన్సర్‌గా ఉంది. 2013,14 ఏడాదిలో రూ.80 కోట్లకు, 2015లో రూ.90 కోట్లకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ దక్కించుకుంది పెప్సీ...

710

2016లో రూ.100 కోట్లకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ దక్కించుకున్న చైనా మొబైల్ కంపెనీ వీవో, ఆ తర్వాతి ఏడాది రూ.100 కోట్లు, 2018లో రూ.80 కోట్లు, 2019లో రూ.130 కోట్లు చెల్లించింది...

810

2020లో చైనా కంపెనీ ఉత్పత్తులపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో వీవో స్థానంలో ఆన్‌లైన్ బెట్టింగ్ కంపెనీ ‘డ్రీమ్ 11’ రూ.222 కోట్లకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ దక్కించుకుంది...

910

2021లో ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ కోసం రూ.260 కోట్లు చెల్లించింది ‘వీవో’... ఈ ఏడాది వీవో స్థానంలో ‘టాటా’ టైటిల్ స్పాన్సర్‌గా రానుంది...

1010

ఐపీఎల్ ప్రసారహక్కుల విక్రయం ద్వారా దాదాపు రూ.35 వేల కోట్లు, ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త జట్ల ద్వారా రూ.12 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని దక్కించుకున్న బీసీసీఐ, ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ద్వారా ‘టాటా’ నుంచి రూ.300 నుంచి రూ.350 కోట్ల దాకా పొందనుందని సమాచారం...

click me!

Recommended Stories