ENG vs IND: టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్సీ చేపట్టాక ఓటమనేదే లేకుండా ముందుకెళ్లుతున్న హిట్ మ్యాన్.. ఇంగ్లాండ్ తో తొలి టీ20లో గెలిచి ఈ రికార్డు అందుకున్నాడు.
రోహిత్ ఉంటే గెలిచినట్టు.. లేకుంటే ఓడడమే.. అన్న తీరుగా తయారైంది టీమిండియా పరిస్థితి. అతడు కెప్టెన్సీ చేపట్టినప్పట్నుంచి భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. అదే రోహిత్ లేని మ్యాచుల్లో భారత్ గెలిచింది చాలా తక్కువ.
26
విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక రోహిత్ శర్మ ఓటమనేదే లేకుండా ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో తొలి టీ20లో నెగ్గడం ద్వారా అతడు ఈ ఫార్మాట్ లో వరుసగా 13 మ్యాచులు గెలిచాడు. తద్వారా ఈ ఫార్మాట్ లో వరుసగా 13 మ్యాచులు గెలిచిన తొలి కెప్టెన్ గా రికార్డులకెక్కాడు.
36
గతంలో ఈ రికార్డు అఫ్ఘనిస్తాన్ మాజీ సారథి అస్గర్ అఫ్గాన్ (వరుసగా 12 విజయాలు), రొమానియా కెప్టెన్ రమేశ్ సతీషన్ (11 విజయాలు) పేరిట ఉండేది. తాజాగా రోహిత్ ఈ ఇద్దరినీ అధిగమించి నెంబర్ వన్ స్థానానికి చేరాడు.
46
టీ20 ప్రపంచకప్ ముగిశాక కోహ్లీ పొట్టి ఫార్మాట్ బాధ్యతలు రోహిత్ కు అప్పజెప్పాడు. అప్పట్నుంచి అతడు న్యూజిలాండ్ తో 3, వెస్టిండీస్ తో 3, శ్రీలంకతో మూడు మ్యాచులలో గెలుపొందాడు. రెగ్యులర్ సారథి కాకముందు బంగ్లాదేశ్ తో (2019లో) రెండు టీ20లలో నెగ్గాడు. ఇక తాజాగా ఇంగ్లాండ్ తో తొలి టీ20లో నెగ్గడం ద్వారా ఓటమనేదే లేకుండా 13 మ్యాచుల్లో గెలిచి సరికొత్త రికార్డులు సృష్టించాడు.
56
రోహిత్ పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యాక టీ20, వన్డే, టెస్టులలో అతడు ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా భారత్ ఓడలేదు. కానీ అతడి గైర్హాజరీలో భారత్ (దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, స్వదేశంలో సఫారీలతో తొలి రెండు టీ20లు, ఇంగ్లాండ్ తో ఎడ్జబాస్టన్ టెస్టులో) తడబడుతున్నది.
66
రోహిత్ లేకుండా దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా.. మూడు వన్డేలలో మూడింటికీ ఓడింది. ఆ సిరీస్ కు కెఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత ఇటీవలే అదే సఫారీలు ప్రత్యర్థులుగా రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు.. తొలి రెండు టీ20లు ఓడి తర్వాత రెండింటిలో గెలిచింది. ఇక ఎడ్జబాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ తో బుమ్రా కెప్టెన్ అయినా టీమిండియాకు ఓటమి తప్పలేదు.