విరాట్ కోహ్లీకి చెక్‌మేట్ పెడుతున్న దీపక్ హుడా... ఫెయిల్ అయితే ప్యాకప్ చెప్పాల్సిందేనా...

Published : Jul 08, 2022, 11:51 AM IST

మూడేళ్ల కిందటి వరకూ మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా పరుగుల వరద పారించాడు విరాట్ కోహ్లీ. అయితే ఒక్కసారిగా ఈ రన్ మెషిన్ నుంచి సెంచరీల ప్రవాహం ఆగిపోయింది. అది అడ్డుకట్ట వల్ల ఆగిన ప్రవాహమా లేక చెరువే ఇంకిపోయిందా... తెలీదు కానీ పేలవ ఫామ్ కారణంగా ఇప్పుడు టీమ్‌లో ప్లేస్‌ కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ...

PREV
111
విరాట్ కోహ్లీకి చెక్‌మేట్ పెడుతున్న దీపక్ హుడా...  ఫెయిల్ అయితే ప్యాకప్ చెప్పాల్సిందేనా...

టీ20 ఫార్మాట్‌లో 97 మ్యాచులు ఆడి 51.50 సగటుతో 3296 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ 2లో ఉన్న విరాట్ కోహ్లీ, టాప్‌లో ఉన్న రోహిత్ శర్మ కంటే 20 మ్యాచులు తక్కువే ఆడాడు...

211

టీ20ల్లో ఇప్పటిదాకా సెంచరీ చేయలేకపోయినా 30 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, కెప్టెన్‌గా టీ20ల్లో 50 మ్యాచుల్లో 30 విజయాలు అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌ 2021 తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడంతోనే విరాట పర్వానికి తెరపడినట్టైంది...

311
Deepak Hooda

ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్‌లతో పాటు పట్టుమని 10 మ్యాచులు కూడా ఆడిన అనుభవం లేని దీపక్ హుడా కూడా విరాట్ కోహ్లీ ప్లేస్‌కి చెక్ పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు...

411

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రెండో టీ20లో 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేసి... సెంచరీ నమోదు చేసిన దీపక్ హుడా, తొలి టీ20లో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు..
 

511
Deepak Hooda

తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్ హుడా 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి మెరుపులు మెరిపించి అవుట్ అయ్యాడు. 194+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన దీపక్ హుదా ఇన్నింగ్స్ కారణంగా 8.3 ఓవర్లలోనే 89 పరుగులకు చేరుకుంది భారత జట్టు...

611
Deepak Hooda

ఇషాన్ కిషన్ 10 బంతులాడి 8 పరుగులు మాత్రమే చేసి అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా... మెరుపులు మెరిపించి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో టీ20ల్లో వన్‌డౌన్ పొజిషన్‌కి దీపక్ హుడా కరెక్ట్ ప్లేయర్ అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

711

టీమిండియా తరుపున 4 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు దీపక్ హుడా. దీపక్ హుడా నాలుగు ఇన్నింగ్స్‌ల తర్వాత 205 పరుగులు చేస్తే.. కెఎల్ రాహుల్ 179, సూర్యకుమార్ యాదవ్ 150, వీరేంద్ర సెహ్వాగ్ 147 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు...

811
Image credit: PTI

దీపక్ హుడా టాపార్డర్‌లో వచ్చి వేగంగా పరుగులు చేయడమే కాదు, అవసరమైతే బౌలింగ్ చేసి వికెట్లు తీయగల ఆల్‌రౌండర్ కూడా. దీంతో అసలే ఫామ్‌లో లేక పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ పొజిషన్ ప్రమాదంలో పడిందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

911

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ వేగంగా పరుగులు చేసి అదరగొట్టాడు. ఇప్పుడు దీపక్ హుడా కూడా వన్‌డౌన్ పొజిషన్‌కి పోటీ వస్తున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 ఆడే జట్టులో విరాట్ కోహ్లీకి చోటు ఉంటుందా? ఉండదా? అనేది కూడా ఇప్పుడే చెప్పలేమంటున్నారు కొందరు నెటిజన్లు..

1011

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచుల్లో ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచుల్లో విరాట్ పర్పామెన్స్, అతని టీ20 కెరీర్‌నే డిసైడ్ చేయనుంది. ఈ మ్యాచుల్లో ఫెయిల్ అయితే, విరాట్ ఇక పొట్టి ఫార్మాట్ నుంచి ప్యాకప్ చెప్పాల్సిందేనని కథనాలు ప్రచారమవుతున్నాయి..

1111

ఫామ్‌లో లేని స్టార్ సీనియర్ ప్లేయర్‌ని ఆడించడం కంటే ఫామ్‌లో ఉండి వేగంగా పరుగులు చేసే యంగ్ ప్లేయర్‌ని ఆడించడానికే బీసీసీఐ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని... అందులోనూ దీపక్ హుడాకి దేశవాళీ క్రికెట్‌లో ఉన్న సుదీర్ఘ అనుభవం జట్టుకి బాగా ఉపయోగపడుతుందని బోర్డు పెద్దలు భావించవచ్చని అంటున్నారు సోషల్ మీడియా జనాలు..

Read more Photos on
click me!

Recommended Stories