నిజం చెప్పాలంటే కోహ్లీ సెంచరీ గురించి ఆలోచించలేదు! నేనే అలా చెప్పి... - కెఎల్ రాహుల్

First Published Oct 20, 2023, 5:15 PM IST

పూణేలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లో అజేయ సెంచరీతో రికార్డులు బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌లో 26 వేల పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, వన్డేల్లో 48వ సెంచరీతో పాటు 78 ఇంటర్నేషనల్ సెంచరీలను పూర్తి చేసుకున్నాడు..

టీమిండియా విజయానికి 26 పరుగులు కావాల్సిన సమయంలో విరాట్ కోహ్లీ 74 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా విజయంపై ఎవ్వరికీ ఎలాంటి డౌట్స్ లేవు కానీ విరాట్ కోహ్లీ సెంచరీ చేయగలడని ఎవ్వరూ అనుకోలేదు...

అయితే టీమిండియా విజయానికి 15 పరుగులు కావాల్సిన సమయంలో సింగిల్ తీయడానికి నిరాకరించిన కెఎల్ రాహుల్, పూర్తిగా నాన్‌-స్ట్రైయికింగ్ ఎండ్‌లోనే ఉండి, విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేయడానికి కారణమయ్యాడు..

‘నిజానికి విరాట్ కోహ్లీ కంఫ్యూజ్ అయ్యాడు. నువ్వు సింగిల్స్ తీయకపోతే, నేను నా పర్సనల్ రికార్డుల కోసం ఆడుతున్నా అని అందరూ అనుకుంటారని అన్నాడు.. వరల్డ్ కప్ లాంటి పెద్ద వేదికపై మైలు రాళ్ల కోసం ఆరాటపడడం కరెక్ట్ కాదని అన్నాడు..

KL Rahul

విరాట్‌కి, నేను ఒక్కటే చెప్పా.. ఇప్పటికే మనం గెలిచే స్టేజ్‌లో ఉన్నాం. మరో రెండు వికెట్లు పడినా ఈజీగా గెలిచేస్తాం. నీకు సెంచరీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు దాన్ని వదులుకోవడం. గట్టిగా ప్రయత్నిద్దాం...

Virat Kohli

ఇందులో నేను పెద్ద పాత్ర పోషించానంటే నవ్వు వస్తోంది. నేను క్రీజులోకి వచ్చే సమయానికి నాకంటూ పరుగులు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కొన్ని షాట్స్ ఆడి, సాధ్యమైనన్ని పరుగులు చేయాలని అనుకున్నా.. కానీ కోహ్లీ 80+ స్కోరు దాటాక నా ఆలోచన మార్చుకున్నా..

Virat Kohli

అందులో సింగిల్స్ తీసి, విరాట్‌కి స్ట్రైయిక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. లక్ష్యం చిన్నది అవుతూ వచ్చేసరికి సింగిల్స్ తీయడం కూడా మానేశా.. విరాట్ కోహ్లీ సెంచరీలో నాకు క్రెడిట్ దక్కడం కంటే గొప్ప అఛీవ్‌మెంట్ ఏముంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు కెఎల్ రాహుల్..   

click me!