వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇదే హైలైట్... విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌ని హగ్ చేసుకున్న రోహిత్ శర్మ

First Published | Oct 20, 2023, 3:01 PM IST

ఒకే టీమ్‌లో ఇద్దరు లెజెండరీ ప్లేయర్లు ఉన్నప్పుడు ఇగోలు, గ్రూప్‌లు కామన్. కొన్ని నెలల వరకూ కూడా టీమిండియాలో కూడా ఇలాంటి వాతావరణమే కనిపించింది. 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీ సెమీ ఫైనల్ ఓటమి తర్వాత భారత జట్టులో గ్రూపుల గురించి పెద్ద చర్చే జరిగింది..
 

కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు రోహిత్ శర్మ ఫోటోల్లో ఎక్కడా విరాట్ ఉండేవాడు కాదు. అయితే ఇప్పుడు టీమ్ వాతావరణం చాలా మారింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఇంతకుముందున్న మనస్పర్థలు, ఇగో గొడవలు అన్నీ తొలగిపోయినట్టు కనిపిస్తోంది.

తాజాగా పూణేలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, 8 వికెట్లు కోల్పోయి 256 పరుగుల ఓ మాదిరి స్కోరు చేసింది. తన్జీద్ హసన్ 51, లిటన్ దాస్ 66 పరుగులు చేశారు. 
 

Latest Videos


Virat Kohli

భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. 257 పరుగుల లక్ష్యాన్ని దూకుడుగా మొదలెట్టింది భారత జట్టు. 48 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హాఫ్ సెంచరీకి ముందు అవుట్ అయ్యాడు..
 

Virat Kohli

శుబ్‌మన్ గిల్ 53 పరుగులు చేసి పెవిలియన్ చేరగా శ్రేయాస్ అయ్యర్ 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కలిసి మ్యాచ్‌ని ముగించారు. కెఎల్ రాహుల్ 34 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 97 బంతుల్లో 6 ఫోర్లు,  4 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు..

విరాట్ కోహ్లీ 70+ పరుగుల వద్ద ఉన్నప్పుడు టీమిండియా విజయానికి 25+ పరుగులు మాత్రమే కావాలి. విరాట్ సెంచరీ చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. అయితే కెఎల్ రాహుల్ సహకారంతో విరాట్ కెరీర్‌లో 48వ వన్డే సెంచరీ బాదాడు..

మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, డ్రెస్సింగ్ రూమ్‌ నుంచి క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌ని హగ్ చేసుకున్నాడు. టీమిండియా ఫ్యాన్స్ ఇలాంటి దృశ్యాలను చూసి చాలా కాలమే అయ్యింది..
 

Virat Kohli

ఓ మ్యాచ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ అందుకోగానే, అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ అతన్ని కౌగిలించుకున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై మ్యాచ్ గెలిపించిన తర్వాత విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మ భుజాలపైకి ఎత్తుకున్నాడు. ఇలాంటి మూమెంట్స్ చూసి టీమిండియా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు..

click me!