విరాట్ కోహ్లీ సెంచరీకి అంపైర్ సాయం! ఆ ఇవ్వని వైడ్ గురించి తీవ్రమైన చర్చ...

Chinthakindhi Ramu | Published : Oct 20, 2023 1:49 PM
Google News Follow Us

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి నాలుగు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్నాయి ఇండియా, న్యూజిలాండ్. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో రికార్డుల దుమ్ము రేపాడు..
 

16
విరాట్ కోహ్లీ సెంచరీకి అంపైర్ సాయం! ఆ ఇవ్వని వైడ్ గురించి తీవ్రమైన చర్చ...
Virat Kohli

ఆగస్టు 2022 నుంచి విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి వచ్చిన 8వ అంతర్జాతీయ సెంచరీ ఇది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, బంగ్లాతో మ్యాచ్‌లో ఆఖర్లో అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు..

26

విరాట్ కోహ్లీ 77 పరుగుల వద్ద ఉన్నప్పుడు టీమిండియా విజయానికి 23 పరుగులు కావాలి. కోహ్లీ సెంచరీ చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. అయితే కెఎల్ రాహుల్ సహకారంతో ఊహించని విధంగా శతకంతో మ్యాచ్‌ని ముగించాడు విరాట్ కోహ్లీ..
 

36

టీమిండియా విజయానికి 2 పరుగులు కావాల్సిన సమయంలో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్ నసుమ్ అహ్మద్, ఓ వైడ్ బాల్ వేశాడు. అప్పటికి విరాట్ కోహ్లీ 97 పరుగుల వద్ద ఉన్నాడు. లెగ్ సైడ్ వెళ్లిన బంతిని విరాట్ కోహ్లీ ఆడకుండా వదిలేశాడు..

Related Articles

46

సెంచరీకి ముందు వైడ్ వేయడంతో విరాట్ కోహ్లీ కాస్త అసహనంగా బౌలర్ వైపు చూశాడు. అయితే అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో, బంతి లెగ్ సైడ్ వైడ్‌గా వెళ్లడం చూసినా.. ‘వైడ్’గా ప్రకటించలేదు...

56

అది వైడ్‌గా ఇచ్చి ఉంటే టీమిండియా విజయానికి 1 పరుగు మాత్రమే కావాల్సి వచ్చేది. అయితే ఆ తర్వాత పెద్దగా హైడ్రామా లేకుండా సిక్సర్ బాది మ్యాచ్‌ని, తన సెంచరీని ఫినిష్ చేశాడు విరాట్ కోహ్లీ..

66
Virat Kohli

ఈ వైడ్ బాల్ గురించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో, టీమిండియాకి ఐసీసీ టోర్నీల్లో అస్సలు కలిసిరాని అంపైర్. అయితే ఒక్క వైడ్ బాల్ ఇవ్వకుండా విరాట్ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేశాడు. అయితే మిగిలిన ఫ్యాన్స్ మాత్రం దీన్ని సాగదీస్తూ, ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ ఏంటని ట్రోల్ చేస్తున్నారు.. 

Read more Photos on
Recommended Photos