మీరు అలా చెప్పకండి, మనసుకు బాధగా ఉంటుంది... మంజ్రేకర్‌కి కౌంటర్ ఇచ్చిన అశ్విన్...

Published : Jun 08, 2021, 11:00 AM IST

రవిచంద్రన్ అశ్విన్‌ను ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్‌గా చూడలేనంటూ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయం చాలా పెద్ద డిస్కర్షన్‌కి దారి తీయడంతో సంజయ్ మంజ్రేకర్ మరోసారి తన దృష్టిలో ఆల్‌టైం గ్రేట్ అంటే ఎలా ఉండాలో చెబుతూ ఓ ట్వీట్ వేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్‌కి రవిచంద్రన్ అశ్విన్ సెటైరికల్ కౌంటర్ ఇచ్చాడు. 

PREV
111
మీరు అలా చెప్పకండి, మనసుకు బాధగా ఉంటుంది... మంజ్రేకర్‌కి కౌంటర్ ఇచ్చిన అశ్విన్...

భారత ఆల్‌రౌండర్, టెస్టుల్లో టాప్ స్పిన్నర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ని ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్‌ కాదంటూ భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ వచ్చింది. టెస్టుల్లో 400+ వికెట్లు, 5 సెంచరీలు చేసిన ఇద్దరు ప్లేయర్లలో ఒకడైన అశ్విన్, ఆల్‌టైం గ్రేట్ కాదని ఎలా అంటారని సంజయ్‌ మంజ్రేకర్‌ను ట్రోల్ చేశారు నెటిజన్లు.

211

టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఎవ్వరికీ అందనంత ఎత్తులో 611 వికెట్లతో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్.  టెస్టుల్లో ఐదు సెంచరీలు బాది, 400+ వికెట్లు తీసిన రెండో క్రికెటర్‌గా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్, తర్వాతి స్థానంలో నిలిచాడు అశ్విన్.

311

అదీకాకుండా అత్యధికమంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ రికార్డును కూడా దాటేశాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో 13 మ్యాచులు ఆడి 67 వికెట్లు తీసిన అశ్విన్, మరో నాలుగు వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు బౌలర్‌గా టాప్‌లో నిలుస్తాడు..

411

100 టెస్టులు ఆడిన ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్, 399 వికెట్లు దగ్గర నిలిచిపోగా... లియాన్ 390 వికెట్లు దగ్గర ఉన్నప్పుడు 370 వికెట్లతోనే ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 400 టెస్టు వికెట్లను దాటేశాడు. 

511

‘‘రవిచంద్రన్ అశ్విన్‌ను ఆల్‌టైం గ్రేట్‌గా ఒప్పుకోవాలంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతను తీసిన ఎక్కువ వికెట్లు భారత ఉపఖండంలో వచ్చినవే. అదీకాకుండా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో అతనికి ఒక్క ఐదు వికెట్లు ప్రదర్శన కూడా లేదు.. ఇంగ్లాండ్ సిరీస్‌లో అశ్విన్ కంటే అక్షర్ పటేల్ ఎక్కువ వికెట్లు తీశాడు’’ అంటూ మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కామెంట్ చేశాడు.

611

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ వచ్చింది. దీంతో మరోసారి తన దృష్టిలో ఆల్‌టైం గ్రేట్ అంటే ఎలా ఉండాలో చెబుతూ ఓ ట్వీట్ వేశాడు సంజయ్. ‘ఆల్‌టైం గ్రేట్ అంటే అది గొప్ప గుర్తింపు, ఓ క్రికెటర్‌కి ఇచ్చే అతిపెద్ద గౌరవం. డాన్ బ్రాడ్‌మన్, గ్యారీ సోబర్స్, సునీల్ గవాసకర్, టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లే నా పుస్తకంలో ఆల్‌టైం గ్రేట్‌. అశ్విన్ మీద ఎంతో గౌరవం ఉన్నా అతను ఇంకా ఆల్‌టైం గ్రేట్‌లో చేరలేదు’ అంటూ ట్వీట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్.

711

కొద్దిసేపటి తర్వాత అభిమానుల డిమాండ్‌తో కొంతమంది ఆల్‌టైం గ్రేట్ బౌలర్లు అంటూ ఇంకో ట్వీట్ వేశాడు సంజయ్. ‘హార్డ్‌లీ, మార్షల్, అక్రమ్, వార్న్... వార్న్ భారత్‌పై వికెట్లు తీయడానికి చాలా కష్టపడ్డాడు. అది తప్ప అతను కూడా మ్యాచ్ విన్నర్. ఇంగ్లాండ్‌లో కూడా అతనికి 8 ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు సంజయ్...

811

ఆల్‌టైం గ్రేట్ అంటే ఎలా ఉండాలో చెబుతూ సంజయ్ మంజ్రేకర్ వేసిన ట్వీట్‌కి... ‘అలా చెప్పకు చారీ... మనసుకు బాధగా ఉంటుంది’ అంటూ విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’ మూవీలోని డైలాగ్‌ను పోస్టు చేశాడు రవిచంద్రన్ అశ్విన్.

911

అశ్విన్ ట్వీట్‌కి మాజీ క్రికెటర్, మాజీ మహిళా క్రికెట్ జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్ స్పందించారు. ‘మాధవా... మీరేమి ఆలోచిస్తున్నారో దాచకుండా చెప్పేయండి’ అంటూ తమిళంలో ట్వీట్ చేశాడు డబ్ల్యూవీ రామన్. దీనికి అశ్విన్ నవ్వుతున్నట్టుగా కామెంట్ చేశాడు. 

1011

సంజయ్ మంజ్రేకర్ వేసిన ఆల్‌టైం గ్రేట్ ట్వీట్‌తో 12 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ మీద వేసిన ఓ పాత ట్వీట్ వైరల్‌గా మారింది. 2012, జనవరి 6న ‘నేను ఇంకా వీవీఎస్‌ను తప్పించి, తర్వాతి టెస్టులో రోహిత్ శర్మకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నా. అలాగే విరాట్ కోహ్లీని ఇంకో టెస్టు ఆడించాలి. అప్పుడు కానీ అతను టెస్టులకు పనికి రాడని సెలక్టర్లకు తెలిసిరాదు’ అంటూ ట్వీట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్.

1111

ఈ ట్వీట్ వేసిన సరిగ్గా 9 సంవత్సరాల ఐదు నెలలకు విరాట్ కోహ్లీని ఆల్‌టైం గ్రేట్ క్రికెటర్లలో ఒకడిగా గుర్తిస్తూ ట్వీట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్. విరాట్‌లాగే రవిచంద్రన్ అశ్విన్ కూడా తన ప్రదర్శనతో సంజయ్ మంజ్రేకర్ ఆల్‌టైం గ్రేట్ లిస్టులో చేరతాడని అంటున్నారు నెటిజన్లు.

click me!

Recommended Stories