మొదటి వరల్డ్ కప్ మ్యాచ్‌లో సెంచరీ.. ఎవరీ రచిన్ రవీంద్ర! అనంతపురంతో లింక్ ఏంటి?

First Published | Oct 5, 2023, 7:11 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర సెన్సేషనల్ సెంచరీతో అదరగొట్టాడు. విల్ యంగ్ డకౌట్ కావడంతో వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ రవీంద్ర,  మొదటి ప్రపంచ కప్ మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు...

ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్లు మొయిన్ ఆలీ, మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఈజీగా బౌండరీలు బాదాడు రచిన్ రవీంద్ర. స్పిన్ ఆల్‌రౌండర్‌గా టీమ్‌లోకి వచ్చిన రచిన్ ఇలా ఆడతాడని చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఊహించలేకపోయారు.

భారత సంతతి ఆటగాడైన రచిన్ రవీంద్ర, న్యూజిలాండ్ ద్వారా టీమిండియాతో మ్యాచ్‌లోనే టెస్టు ఆరంగ్రేటం చేశాడు. ఇప్పటిదాకా 18 టీ20, 13 వన్డే మ్యాచులు ఆడిన రచిన్ రవీంద్ర, బ్యాటుతో 26 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు.. నేటి మ్యాచ్‌లో టాపార్డర్‌లో వచ్చి సెంచరీ బాదేశాడు. 
 


Rachin Ravindra

వాస్తవానికి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌ మ్యాచ్‌లో రచిన్ రవీంద్రకి చోటు దక్కింది. అయితే తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు రచిన్ రవీంద్ర... 

23 ఏళ్ల రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతీయులే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు...

అక్కడే పుట్టి పెరిగిన రచిన్ రవీంద్ర, క్రికెట్‌లో రాటుతేలింది మాత్రం ఇక్కడే. ప్రతీ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న ఆర్‌డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్)కి వచ్చి క్రికెట్ ఆడతుండేవాడు రచిన్...

తన తండ్రి రవి కృష్ణమూర్తి స్థాపించిన హాట్ హాక్స్ క్లబ్ తరుపున రచిన్ రవీంద్రతో పాటు చాలామంది ప్లేయర్లు, న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి క్రికెట్ టోర్నీలు ఆడుతుండేవారట...

బ్యాటుతో బాల్‌తో అదరగొడుతూ మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రచిన్ రవీంద్ర ఫెవరెట్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్...

Latest Videos

click me!