ఆ కోచ్, దీపక్ చాహార్‌ క్రికెట్‌కి పనికిరాడని అన్నాడు... మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్...

First Published Jul 22, 2021, 3:57 PM IST

ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో టీమిండియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు దీపక్ చాహార్. ఇంతకుముందు టీమిండియాకి ఆడిన అనుభవం, టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన రికార్డు ఉన్నప్పటికీ... శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో దీపక్ చాహార్ బ్యాటుతో ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఓ సంచలనం...

193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి భారత జట్టు ఓటమి ఖాయమనుకున్న సమయంలో క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్‌ కుమార్‌తో కలిసి అజేయంగా 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దీపక్ చాహార్, చిరస్మరణీయ విజయం అందించాడు...
undefined
82 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 69 పరుగులు చేసిన దీపక్ చాహార్, బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ అభిమానాన్ని కూడా గెలుచుకున్నాడు...
undefined
అయితే దీపక్ చాహార్‌ను క్రికెట్ పనికి రాడని తేల్చి, వేరే పని చూసుకొమ్మని చెప్పాడట భారత మాజీ కోచ్ గ్రేగ్ చాపెల్. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్...
undefined
‘రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌లో ఉన్న సమయంలో దీపక్ చాహార్‌ను గ్రేగ్ చాపెల్ రిజెక్ట్ చేశాడు. దీపక్ చాహార్ ఎత్తు కారణంగా క్రికెట్‌కి పనికి రావని, వేరే ఏదైనా పని చూసుకొమ్మని సలహా కూడా ఇచ్చాడు..
undefined
అయితే ఇప్పుడు అతను ఒంటిచేత్తో భారత జట్టుకి విజయాన్ని అందించాడు. అది కూడా బౌలింగ్‌తో కాదు, బ్యాటింగ్‌తో... కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి, విదేశా కోచ్‌లు చెప్పినదాన్ని సీరియస్‌గా తీసుకోకండి...
undefined
భారత్‌లో అద్భుతమైన టాలెంట్ ఉన్న ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఫ్రాంఛైజీలు, జట్లు స్వదేశీ కోచ్‌లు, మెంటర్లను తీసుకోవడంపై దృష్టి పెట్టాలి...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్, కోచ్ వెంకటేశ్ ప్రసాద్...
undefined
భారత జట్టుకి కోచ్‌గా వ్యవహారించిన గ్రేగ్ చాపెల్, అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ నుంచి, ఆ తర్వాత టీమ్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. గంగూలీ, గ్రేగ్ చాపెల్ మధ్య జరిగిన గొడవ ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ మరిచిపోలేదు.
undefined
టీమిండియా కోచ్‌గా రిటైర్ అయిన తర్వాత 2008లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకి అకాడమీ కోచ్‌గా వ్యవహారించాడు గ్రేగ్ చాపెల్. ఈ సమయంలో జరిగిన సంఘటననే ఇప్పుడు బయటపెట్టాడు వెంకటేశ్ ప్రసాద్.
undefined
click me!