Glenn Phillips: గ్లెన్ ఫిలిప్స్ మెరుపు సెంచరీ... రికార్డులు బద్దలు కొట్టిన కీవీస్ స్టార్

Published : Oct 30, 2026, 03:32 PM IST

Glenn Phillips Century: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో గ్లెన్ ఫిలిప్స్ సెంచరీతో చెలరేగారు. భారత్‌కు 260 పరుగుల భారీ లక్ష్యాన్ని కవీస్‌ ఉంచింది. తన ఇన్నింగ్స్ గ్లెన్ ఫిలిప్స్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

PREV
15
ఈడెన్ పార్క్‌లో గ్లెన్ ఫిలిప్స్ సునామీ ఇన్నింగ్స్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ లో నాలుగో మ్యాచ్ లో గ్లెన్ ఫిలిప్స్ రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 46 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

25
రికార్డుల పుస్తకంలోకి ఫిలిప్స్

ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన గ్లెన్ ఫిలిప్స్ అనేక రికార్డులను తన పేరున రాసుకున్నాడు. భారత్‌పై టీ20ల్లో సెంచరీ సాధించిన కోలిన్ మున్రో (2017లో రాజ్కోట్‌లో) తర్వాత రెండో కీవీస్ ఆటగాడిగా ఫిలిప్స్ నిలిచాడు. అంతేకాకుండా, భారత్‌పై టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన షాయ్ హోప్ రికార్డును ఫిలిప్స్ బ్రేక్ చేశాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతను వరుసగా హాఫ్ సెంచరీలు, ఆ తర్వాత సెంచరీ సాధించి, ప్రస్తుతం ఈ రికార్డును తన పేరు మీదకు మార్చుకున్నాడు.

35
ఫిలిప్స్ - మైఖేల్ బ్రాస్‌వెల్ రికార్డు భాగస్వామ్యం

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్ జోడీ భారత్‌కు చుక్కలు చూపించింది. ఇద్దరూ కలిసి కేవలం 40 బంతుల్లోనే 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓవర్‌కు 16.82 రన్ రేట్‌తో పరుగులు సాధించి చరిత్ర సృష్టించారు. మైఖేల్ బ్రాస్‌వెల్ కేవలం 25 బంతుల్లో 65 పరుగులు చేయగా, ఫిలిప్స్ 49 బంతుల్లో 107 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరి జోరుతో కీవీస్ జట్టు సులభంగా 250 పరుగుల మార్కును దాటగలిగింది.

45
ఆరు ఫోర్లు, పది సిక్సులతో విధ్వంసం

మైదానంలో నలువైపులా చెలరేగి ఆడిన గ్లెన్ ఫిలిప్స్ కేవలం 49 బంతుల్లోనే 107 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు ఉన్నాయి. తొలి మూడు మ్యాచ్‌లలోనూ నిలకడైన ప్రదర్శన చేసిన ఫిలిప్స్, ఈ మ్యాచ్‌లో మాత్రం తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. చివరి ఓవర్ వరకు నిలకడగా ఆడిన అతను జట్టును బలమైన స్థితిలో నిలిపాడు.

55
భారత్ ముందు కొండంత లక్ష్యం

గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా భారత్‌కు 260 పరుగుల భారీ లక్ష్యమిచ్చింది న్యూజిలాండ్. తొలి మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌కు, ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద సవాల్‌గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories