Hardik Pandya: హార్దిక్ పాండ్యా కోసం బిగ్ ప్లాన్.. ముగ్గురు స్టార్లను ఇచ్చేస్తున్న సీఎస్‌కే !

Published : Oct 30, 2026, 02:01 PM IST

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 కు ముందు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ అంశం హాట్ టాపిక్ గా మారింది. పాండ్యాను సొంతం చేసుకునేందుకు సీఎస్‌కే ఏకంగా ముగ్గురు ప్లేయర్లను ఆఫర్ చేస్తోందనే వార్తలు వైరల్ గా మారాయి.

PREV
15
ఐపీఎల్ 2027 బిగ్గెస్ట్ ట్రేడ్ డ్రామా: సీఎస్‌కే వైపే హార్దిక్ చూపు

ఐపీఎల్ 2027 సీజన్ మొదలవ్వడానికి ముందే ట్రేడింగ్ మార్కెట్ హీటెక్కిపోయింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈసారి టీమ్ మారడం దాదాపు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా హార్దిక్‌ను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తీవ్రంగా ట్రై చేస్తోందని క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.

హార్దిక్ కూడా యల్లో ఆర్మీలోకి ఎంటర్ కావడానికి చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడని సమాచారం. అయితే, హార్దిక్ లాంటి స్టార్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకోవాలంటే చెన్నై మామూలు ఆఫర్ ఇస్తే సరిపోదు. అందుకే టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ 'యాష్ ఎక్స్ పీడాగ్'లో ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడ్ కాన్సెప్ట్‌ను బయటపెట్టాడు.

25
ముంబై ప్లాన్ వేరేలా ఉంటుంది: దూబే ఒక్కడు సరిపోడు

రవిచంద్రన్ అశ్విన్ విశ్లేషణ ప్రకారం.. సీఎస్‌కే కేవలం శివమ్ దూబేను మాత్రమే ఆఫర్ చేస్తే ముంబై ఇండియన్స్ ఏమాత్రం ఒప్పుకోదు. హార్దిక్ లాంటి ఇంపాక్ట్ ప్లేయర్‌ను వదులుకోవాలంటే ముంబై తప్పకుండా భారీగా డిమాండ్ చేస్తుంది. దూబేతో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్ ఆయుష్ మాత్రేను కూడా ముంబై అడిగే ఛాన్స్ ఉంది.

కానీ 19 ఏళ్ల ఆయుష్ మాత్రే, అలాగే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్‌లాంటి ప్లేయర్లను వదులుకోవడానికి సీఎస్‌కే సిద్ధంగా లేకపోవచ్చు. అందుకే ముంబై మేనేజ్‌మెంట్ నో చెప్పకుండా ఉండేలా సీఎస్‌కే ఒక మైండ్ బ్లాకింగ్ మల్టీ-ప్లేయర్ ప్యాకేజీని రెడీ చేయాల్సి ఉంటుంది.

35
అశ్విన్ చెప్పిన మాస్టర్ ప్లాన్: ఈ ముగ్గురిని ఆఫర్ చేస్తే బెటర్

ఆయుష్ మాత్రేను కాపాడుకుంటూనే ట్రేడ్ సక్సెస్ అవ్వాలంటే అశ్విన్ ఒక క్రేజీ ఆప్షన్ సూచించాడు. శివమ్ దూబేతో పాటు ఆస్ట్రేలియా పవర్ ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్, వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్‌లను ముంబైకి ఆఫర్ చేయడం బెస్ట్ ఐడియా అని చెప్పాడు.

• నాథన్ ఎల్లిస్: డెత్ ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రాకు పర్ఫెక్ట్ పార్టనర్‌గా ఉంటాడు. గతంలో ట్రెంట్ బౌల్ట్ చేసిన మ్యాజిక్‌ను ఎల్లిస్ రీప్లేస్ చేయగలడు.

• ఉర్విల్ పటేల్: ముంబైకి ఒక మంచి వికెట్ కీపింగ్ బ్యాటర్ ఆప్షన్ దొరుకుతుంది. ఈ ముగ్గురితో కూడిన ప్యాకేజీ ఇస్తే ముంబై ఇండియన్స్ హార్దిక్‌ను వదులుకోవడానికి ఆలోచించక తప్పదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

45
దీపక్ చాహర్ రిటర్న్: సీఎస్‌కే మరో ఊహించని డీల్

ఈ డీల్‌లో అశ్విన్ ఇంకో మాస్ ట్విస్ట్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యాతో పాటు గతంలో సీఎస్‌కేలో ఆడిన దీపక్ చాహర్‌ను కూడా తిరిగి చెన్నైకి తెచ్చుకుంటే ఇంకా బాగుంటుందని అన్నాడు. ముంబై ఇండియన్స్ దీపక్ చాహర్‌ను సరిగ్గా వాడుకోలేకపోయింది. కానీ ఎంఎస్ ధోనీకి, సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు చాహర్‌ను ఎప్పుడు, ఎలా వాడాలో బాగా తెలుసు. పైగా చెన్నై హోమ్ పిచ్‌పై చాహర్‌కు తిరుగులేని రికార్డు ఉంది. అందుకే దూబే, ఎల్లిస్, ఉర్విల్ పటేల్‌లతో పాటు మరో పేసర్‌ను ఇచ్చి హార్దిక్, దీపక్ చాహర్ ఇద్దరినీ ఒకేసారి సీఎస్‌కే తెచ్చుకుంటే ఆఫర్ మరింత బలంగా మారుతుంది.

55
పోటీలో 6 టీమ్స్: డిసెంబర్ 9తో ముగియనున్న డెడ్‌లైన్

హార్దిక్ పాండ్యా కోసం కేవలం సీఎస్‌కే మాత్రమే కాదు, దాదాపు 6 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నట్లు సమాచారం.

• కేకేఆర్: వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలను ఆఫర్ చేస్తూ కెప్టెన్సీ ఇస్తామనే ఆలోచనలో ఉంది.

• రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌ల పేర్లతో రేసులో ఉంది.

• పంజాబ్ కింగ్స్: మార్కో యాన్సెన్, యుజ్వేంద్ర చాహల్‌ల ప్యాకేజీని పరిశీలిస్తోంది.

ఇలాంటి భారీ పోటీని తట్టుకుని హార్దిక్‌ను సొంతం చేసుకోవాలంటే సీఎస్‌కే అందరికంటే బెస్ట్ ఆఫర్ ఇవ్వక తప్పదు. ఐపీఎల్ 2027 ట్రేడింగ్ విండో డిసెంబర్ 9తో క్లోజ్ కానుంది. నవంబర్ 15 నాటికి రిటెన్షన్ లిస్ట్ ఇవ్వాల్సి ఉండగా, డిసెంబర్ 16న గ్రాండ్ ఆక్షన్ జరగనుంది. దీంతో ఆక్షన్ కంటే వారం ముందే ఈ మెగా ట్రేడ్ డీల్ క్లియర్ కానుంది. మరి జహీర్ ఖాన్ హింట్స్, అశ్విన్ లెక్కల ప్రకారం హార్దిక్ యల్లో జెర్సీ వేసుకుంటాడో లేదో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories