Glenn Maxwell equals Rohit Sharma's record: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా మెగా టోర్నమెంట్ ట్రోఫీ గెలవడంతో గ్లెన్ మ్యాక్స్ వెల్ కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మూడో మ్యాచ్ లో తన ధనాధన్ ఇన్నింగ్స్ తో కంగారులకు సూపర్ విక్టరీని అందించాడు.
మూడో టీ20 మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ 48 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 104 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డులకు ఎసరు పెట్టాడు మ్యాక్స్ వెల్.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ సమం చేశాడు. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో భారత్తో జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ 47 బంతుల్లోనే అద్భుత సెంచరీతో ఆస్ట్రేలియా చివరి బంతికి ఉత్కంఠభరిత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
వరుసగా రెండు మ్యాచ్ లను ఓడిపోయిన తర్వాత ఒత్తిడిలో ఉన్నకంగారులు ఈ గెలుపుతో సిరీస్ పై ఆశాలు నిలిపి ఉంచుకున్నారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ ఆధిక్యాన్ని ఆస్ట్రేలియా 2-1కి తగ్గించగలిగింది.
కానీ, టీ20 ఫార్మాట్ లో చెరో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాళ్ల రికార్డును హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇద్దరు ఆటగాళ్లు పంచుకున్నారు. మ్యాక్సి తన ఇన్నింగ్స్ లో 48 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 104 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా తరఫున మ్యాక్స్ వెల్ ఇది 100వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. ఈ విజయం టీ20 క్రికెట్ లో మ్యాక్సి పోరాటాన్ని ఎత్తిచూపడంతో పాటు ఆటపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అతని సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది.