ఐపీఎల్ 2024: ఆర్సీబీలోకి సెహ్వాగ్ మేన‌ల్లుడు.. 9 జట్లకు ఓపెన్ ఛాలెంజ్ !

First Published Nov 28, 2023, 5:09 PM IST

IPL 2024: దేశవాళీ క్రికెట్ లో మ‌యాంక్ దాగ‌ర్ ఫస్ట్ క్లాస్ 37, లిస్ట్ ఏ 47, T20 53 మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా 57, 52, 55 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ లో 801, లిస్ట్ ఏలో 407, టీ20ల్లో 72 పరుగులు చేశాడు.
 

RCB-Mayank Dagar: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజ‌న్ ఆట‌గాళ్ల‌ వేలానికి ముందు ట్రేడ్ విండో తెరిచి వుండ‌గా, దానికి ఆదివారంతో సాయంత్రం గ‌డువు ముగిసింది. ఈ క్ర‌మంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) తమ ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అప్పగించింది.

ఇదే స‌మ‌యంలో టీం ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మేనల్లుడిని అతని జట్టు కొనుగోలు చేసింది. ఆర్సీబీలో చేరిన తర్వాత సెహ్వాగ్ మేనల్లుడు మయాంక్ దాగర్ తొలిసారి స్పందిస్తూ ఐపీఎల్ లోని ఇత‌ర జ‌ట్ల‌కు స‌వాలు విసిరాడు. 

టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచంలోని ధ‌నాధ‌న్ బ్యాట్స్‌మెన్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఆయ‌న మేనల్లుడు మయాంక్ దాగర్ కూడా అదే బాటలో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐపీఎల్ లో 'ట్రేడింగ్'లో, షాబాజ్ అహ్మద్‌కు బదులుగా, RCBకి మయాంక్ డాగర్ రూపంలో బలమైన ఆటగాడు లభించాడు. 

విరాట్ కోహ్లీ జ‌ట్టులో మ‌యాంగ్ దాగ‌ర్ చేరిన త‌ర్వాత ఆర్సీబీ ఫ్రాంచైజీ ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో మయాంక్  మాట్లాడుతూ.. తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాన‌ని పేర్కొన్నాడు. 

"నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. నాపై విశ్వాసం చూపినందుకు ఆర్సీబీ అండ్ కోచింగ్ సిబ్బందికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నేను నా 100 శాతం కృషి చేస్తాను.. అందరం కలిసి ఐపీఎల్‌ ట్రోఫీని కైవసం చేసుకుంటామని నాకు నమ్మకం ఉందని" పేర్కొన్నాడు.

మయాంక్ దాగర్ గత ఏడాది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. గత ఐపీఎల్ సీజన్‌లో మయాంక్‌ను 3 మ్యాచ్‌ల్లో మాత్ర‌మే ఆడాడు. ఇందులో ఒక వికెట్ తీసుకోగా, బ్యాటింగ్ చేసే అవ‌కాశం ల‌భించ‌లేదు. దేశవాళీ క్రికెట్ లో మ‌యాంక్ దాగ‌ర్ ఫస్ట్ క్లాస్ 37,  లిస్ట్ ఏ 47, టీ20 53 మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా 57, 52, 55 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ లో 801, లిస్ట్ ఏలో 407, టీ20ల్లో 72 పరుగులు చేశాడు.

click me!