IND vs AUS T20: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సిరీస్ మ‌ధ్య‌లోనే కీల‌క ఆట‌గాళ్లు దూరం..

First Published | Nov 28, 2023, 4:29 PM IST

India Vs Australia T20 Series: ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన మంచి జోష్ లో క‌నిపించిన ఆస్ట్రేలియా జ‌ట్టు.. భార‌త్ తో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మాత్రం వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల‌లో ఓడిపోవ‌డంతో కాస్త ఒత్తిడిలోకి జారుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మరో బిగ్ షాక్ తగిలింది. 

IND vs AUS 3rd T20I: భార‌త్‌తో జ‌రుగుతున్న‌ ఐదు టీ20ల సిరీస్‌లో రెండు వ‌రుస ఓట‌ములు చ‌విచూసన ఆసీస్ కు మారో బిగ్ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టుకు చెందిన కీల‌క ఆట‌గాళ్లు ఈ సిరీస్ నుంచి దూరం అయ్యారు. వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో ఉన్న‌ ఆరుగురు స్వ‌దేశానికి బ‌య‌లుదేరారు. 
 

భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరిస్ లో రెండు మ్యాచ్ ల‌లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా సెలక్టర్లు టీ20 జట్టులో కీలక మార్పులు చేశారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 నేడు గౌహతిలో జరగనుంది. కొత్త జట్టుకు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు.


ఐదు మ్యాచ్ ల సిరీస్ కోసం మాత్రమే ఆస్ట్రేలియా సెలక్టర్లు టీ20 జట్టులో మార్పులు చేశారు. నవంబర్ 28 మంగళవారం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో జరిగే మూడో టీ20 మ్యాచ్ కు కొన్ని గంటల ముందు ఆస్ట్రేలియా తమ జట్టులో మార్పులు చేసిన‌ట్టు స్ప‌ష్టం చేసింది.
 

గత ఐదు నెలలుగా అవిశ్రాంతంగా ఉన్న ప్రపంచకప్ విజేత ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. గౌహతి వేదికగా జరగనున్న మూడో వన్డేకు ముందు ప్రపంచకప్ విజేతలు స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా స్వదేశానికి పయనమయ్యారు.
 

ఐదు మ్యాచ్ ల సిరీస్ మధ్యలో ఆరుగురు ప్రపంచ కప్ స్టార్లు భారత్ నుంచి స్వదేశానికి వెళ్ల‌డంతో ఆస్ట్రేలియా మంగళవారం తమ టీ20 జట్టులో భారీ మార్పులను ధృవీకరించింది. ప్రపంచకప్ 2023 ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్ టీ20 సిరీస్ లో కొనసాగే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాట‌ర్. 
 

మరోవైపు గువాహటిలో జరిగే మూడో టీ20 మ్యాచ్ తర్వాత గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, జోష్ ఇంగ్లిస్ జట్టును వీడనున్నారు. నాలుగో టీ20 మ్యాచ్ డిసెంబర్ 1న రాయ్ పూర్ లో, చివరి టీ20 మ్యాచ్ డిసెంబర్ 3న బెంగళూరులో జరగనున్నాయి.

Latest Videos

click me!