మాహీ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన గౌతమ్ గంభీర్... ఎమ్మెస్ ధోనీ టాపార్డర్‌లో వచ్చి ఉంటే రికార్డులన్నీ...

Published : Mar 19, 2022, 11:52 AM IST

టీమిండియా క్రికెట్‌ని ఫాలో అయ్యేవారికి గౌతమ్ గంభీర్, ఎమ్మెస్ ధోనీ మధ్య ఉన్న వైరం గురించి బాగా తెలిసే ఉంటుంది. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో హెలికాఫ్టర్ షాట్‌తో సిక్సర్ కొట్టి, క్రెడిట్ అంతా మాహీయే కొట్టేశాడని చాలాసార్లు బహిరంగంగానే ఆరోపించాడు గౌతమ్ గంభీర్...

PREV
110
మాహీ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన గౌతమ్ గంభీర్... ఎమ్మెస్ ధోనీ టాపార్డర్‌లో వచ్చి ఉంటే రికార్డులన్నీ...

కేవలం ఎమ్మెస్ ధోనీ కొట్టిన ఆ ఒక్క సిక్సర్ కారణంగా టీమిండియా, వరల్డ్ కప్ గెలవలేదని... తాను, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, జహీర్ ఖాన్‌ల ఇన్నింగ్స్‌ల కారణంగానే గెలిచిందని చాలాసార్లు కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

210

అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగుల వద్ద ఉన్న తాను, సెంచరీ పూర్తి చేసుకోకపోవడానికి కూడా మాహీయే కారణమని, అతనే ఆ విషయాన్ని గుర్తు చేసి టెన్షన్ పెట్టాడని ఆరోపించాడు గౌతమ్ గంభీర్...

310

అదీకాకుండా ఎమ్మెస్ ధోనీ పుట్టినరోజున తన 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన మట్టికొట్టుకుపోయిన జెర్సీని సోషల్ మీడియాలో పోస్టు చేసిన గౌతమ్ గంభీర్... తొలిసారి మాహీని పొడుగుతూ మాట్లాడి ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేశాడు..

410

‘నాకు, మాహీకి మధ్య గొడవలు ఉన్నాయనేది కేవలం పుకారు మాత్రమే. ఓ క్రికెటర్‌గా, మనసున్న మనిషిగా మాహీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది...

510

అతనికి ఏ అవసరం వచ్చినా నేను ముందుంటా. అదీకాకుండా ఎమ్మెస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎక్కువ రోజులు వైస్ కెప్టెన్‌గా ఉన్నది నేనే...

610

ఐపీఎల్‌లో ఆడినప్పుడు ప్రత్యర్థుల్లా తలబడతాం, ఆ తర్వాత స్నేహితుల్లా కలిసి పోతాం... మాహీ, టీమిండియా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు...
 

710

కెరీర్ ప్రారంభంలోనే తన బ్యాటింగ్ పొజిషన్‌ని ఇతరులకు ఇచ్చేశాడు. కెరీర్ ఆసాంతం టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి ఉంటే ధోనీ... క్రికెట్ రికార్డులన్నీ తిరగరాసేవాడు... ’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

810

ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి మెంటర్‌గా వ్యవహరించబోతున్న గౌతమ్ గంభీర్, ఒక్కసారిగా మాహీ గురించి పాజిటివ్‌గా మాట్లాడడంతో అందరూ అవాక్కవుతున్నారు...

910

సడెన్‌గా గౌతమ్ గంభీర్‌లో ఇంతటి మార్పు ఎలా వచ్చింది? అదీ ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు ఎందుకు వచ్చింది? అంటూ లెక్కలు కడుతున్నారు...

1010

మాహీ గురించి మాత్రమే కాకుండా భారత మాజీ కెప్టెన్ విరాట్ గురించి పాజిటివ్‌గా స్పందించిన గౌతీ, కోహ్లీ 100 సెంచరీల రికార్డును తిరగరాస్తాడంటూ కామెంట్ చేశాడు...

Read more Photos on
click me!

Recommended Stories