ఒక్క సీజన్ ఫెయిల్ అయినంత మాత్రాన, చెత్త ప్లేయర్‌ని అయిపోను... - నికోలస్ పూరన్...

Published : Mar 18, 2022, 08:47 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెత్త రికార్డు క్రియేట్ చేశాడు విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున 12 మ్యాచుల్లో కలిపి 85 పరుగులు మాత్రమే చేయగలిగాడు నికోలస్ పూరన్...

PREV
18
ఒక్క సీజన్ ఫెయిల్ అయినంత మాత్రాన,  చెత్త ప్లేయర్‌ని అయిపోను... - నికోలస్ పూరన్...

పంజాబ్ కింగ్స్ తరుపున 12 మ్యాచుల్లో కలిపి 7.75 యావరేజ్‌తో 85 పరుగులు చేసిన నికోలస్ పూరన్, నాలుగు మ్యాచుల్లో నాలుగు విధాలుగా డకౌట్ అయ్యాడు...

28

బంతులేమీ ఎదుర్కోకుండా రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ అయిన నికోలస్ పూరన్, మరో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్, ఇంకో మ్యాచ్‌లో సిల్వర్ డకౌట్ (రెండో బంతికి డకౌట్), మరో ఐపీఎల్ మ్యాచ్‌లో బ్రౌన్జ్ డకౌట్ (మూడో బంతికి డకౌట్) అయి పెవిలియన్ చేరాడు...

38

ఐపీఎల్ 2021 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన నికోలస్ పూరన్‌ని ఏకంగా రూ.10.75 కోట్లు పెట్టి, ఐపీఎల్ 2022 మెగా వేలంలో కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

48

టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో, ఆ తర్వాత టీ10 బ్లాస్ట్ లీగ్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్‌లతో సూపర్ ఫామ్‌లో ఉన్న నికోలస్ పూరన్‌పై భారీ ఆశలే పెట్టుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్..
 

58

‘ఒక్క బ్యాడ్ సీజన్‌ కారణంగా నేను పనికి రాని ప్లేయర్‌ని అయిపోను కదా. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో నేను బాగా ఆడుతున్నా. నా ఆటతీరు అందరూ చూస్తున్నారు...

68

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాపై నమ్మకం ఉంచి, నా కోసం భారీగా ఖర్చు చేసింది. ఆ మొత్తాన్ని నయా పైసాతో చెల్లించాల్సిన బాధ్యత నా మీద ఉంది...

78

గత సీజన్‌లో నాలుగు మ్యాచుల్లో డకౌట్ కావడం ఇప్పటికీ మరిచిపోలేదు. అందరి జీవితాల్లో అలాంటి ఓ ఫేజ్ కామన్ అనుకుంటా... అయితే నాపైన నాకు నమ్మకం ఉంది...

88

ప్రతీ ప్లేయర్‌లోనూ కొన్ని సాంకేతిక లోపాలు ఉంటాయి. అయితే నా విషయంలో నా మానసిక పరిస్థితే ప్రధానం. నాకు గేమ్‌పై క్లారిటీ ఉంది. ఈసారి రాణించడానికి కావాల్సిన మైండ్‌సెట్‌తోనే బరిలో దిగాను...’ అంటూ కామెంట్ చేశాడు నికోలస్ పూరన్...

click me!

Recommended Stories