ధోనీ అలా చేశాడు! ఈసారైనా రోహిత్ శర్మ కాకుండా టీమిండియా గెలుస్తుందని అనుకుంటున్నా... గంభీర్ ఆవేదన...

First Published | Oct 21, 2022, 10:57 AM IST

టీ20 వరల్డ్ కప్ 2007తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. అలాగే ఈ రెండు టోర్నీల్లో యువరాజ్ సింగ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. అయితే గంభీర్‌కి కానీ, యువీకి కానీ ఈ రెండు విజయాల్లో దక్కాల్సినంత క్రెడిట్ దక్కలేదు...

2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ రెండు విజయాలు కూడా అప్పటి మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలోనే పడ్డాయి. మాహీ కెప్టెన్సీ వల్లే టీమిండియా గెలిచిందని ఇప్పటికీ నమ్ముతారు చాలా మంది. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో మాహీ కొట్టిన హెలికాఫ్టర్ షాట్‌కి దక్కిన క్రేజ్, మట్టికొట్టుకుపోయిన గంభీర్ జెర్సీకి దక్కలేదు...

2011 వన్డే వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ చూపించి, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ నెగ్గిన యువరాజ్ సింగ్‌కి కానీ, జహీర్ ఖాన్, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ వంటి ప్లేయర్లకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు...


‘2007, 2011 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంఎస్ ధోనీ గెలిచాడని అన్నారు. 83లో వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా కపిల్ దేవ్ గెలిచాడని చెప్పారు. కానీ గెలిచింది వాళ్లు కాదు, ఇండియా గెలిచింది...

ఎందుకంటే కెప్టెన్ ఒక్కడే ఏ టీమ్‌నీ గెలిపించలేదు. మిగిలిన ప్లేయర్లు ఫీల్డింగ్ చేస్తారు, క్యాచులు అందుకుంటారు, బౌలింగ్ చేస్తారు, బ్యాటింగ్‌లో పరుగులు చేస్తారు... వాళ్లని ఎవ్వరూ గుర్తించడం లేదు...

Image credit: PTI

ఈసారి అయినా వరల్డ్ కప్ గెలిస్తే, రోహిత్ శర్మ గెలిచాడని కాకుండా ఇండియా గెలిచిందని అంటారని ఆశిస్తున్నాం... ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్ మాత్రమే, అతనే టీమ్ కాదు...’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్... 
 

Rohit Sharma-Kane Williamson

జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి కీ బౌలర్లు దూరం కావడంతో ఈసారి టీమిండియాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్, ఈసారి మ్యాజిక్ చేస్తాడని టీమిండియా ఫ్యాన్స్ ఇంకా ఆశలు పెట్టుకున్నారు...

Latest Videos

click me!