బ్యాటింగ్, బౌలింగ్ కాదు, మ్యాచ్ గెలవాలంటే అన్నింటికంటే అదే కీలకం... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో..

Published : Jun 17, 2021, 01:27 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎవరు గెలుస్తారనే చర్చ వీర లెవెల్లో జరుగుతోంది. ఇంగ్లాండ్ పిచ్, వాతావరణ పరిస్థితులు న్యూజిలాండ్‌కి అనుకూలంగా ఉండడంతో వాళ్లే గెలుస్తారని కొందరు అంటుంటే, లేదు టీమిండియా చరిత్ర తిరగరాస్తుందని మరికొందరు అంటున్నారు...

PREV
113
బ్యాటింగ్, బౌలింగ్ కాదు, మ్యాచ్ గెలవాలంటే అన్నింటికంటే అదే కీలకం... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో..

న్యూజిలాండ్‌తో పోలిస్తే టీమిండియా కూడా పటిష్టమైన బ్యాటింగ్, మేటి ఫాస్ట్ బౌలర్లు, వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్లతో బలంగానే కనిపిస్తోంది. అయితే టీమిండియాలో చాలామందికి ఇంగ్లాండ్‌ పిచ్‌లపై ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడం ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెడుతున్న విషయం...

213

రోహిత్ శర్మకు విదేశాల్లో చెప్పుకోదగ్గ రికార్డు లేదు. స్వదేశాల్లో 80+ యావరేజ్‌తో పరుగులు చేసే రోహిత్ శర్మ, విదేశాల్లో కేవలం 27 సగటుతో పరుగులు చేశాడు. అతని సహచరుడు శుబ్‌మన్ గిల్‌కి ఇదే మొట్టమొదటి ఇంగ్లాండ్ టూర్....

313

విరాట్ కోహ్లీ రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాదీ ఇదే పరిస్థితి. అజింకా రహానే ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు ఆడడో అతనికే క్లారిటీ ఉండదు...

413

బ్యాటింగ్‌, బౌలింగ్ గురించి పక్కనబెడితే ఫైనల్‌లో అత్యంత కీలకంగా మారే అంశం టాస్... ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచుల్లో టాస్ గెలిచిన జట్టుకే విజయం దక్కడం విశేషం...

513

ఇప్పటిదాకా న్యూజిలాండ్, ఇండియా మధ్య 21 టెస్టు సిరీస్‌లు జరగగా అందులో 11 టెస్టు సిరీసుల్లో విజయం సాధించింది టీమిండియా. 6 టెస్టు సిరీసుల్లో న్యూజిలాండ్‌కి విజయం దక్కింది. నాలుగు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి...

613

మొత్తంగా ఇరు దేశాల మధ్య 59 టెస్టు మ్యాచులు జరగగా అందులో 21 మ్యాచుల్లో భారత జట్టు గెలవగా, 12 మ్యాచుల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఏకంగా 26 మ్యాచులు డ్రాగా ముగిశాయి...

713

అయితే ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన గత ఐదు టెస్టులను పరిశీలిస్తే, 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరిగిన రెండు టెస్టుల్లోనూ కివీస్‌కే విజయం దక్కింది. అయితే ఈ రెండు టెస్టుల్లోనూ న్యూజిలాండ్ టాస్ గెలవడం విశేషం...

813

అంతకుముందు 2016లో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు మూడు టెస్టుల్లోనూ న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసి 3-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మూడు టెస్టుల్లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం...

913

ఇంగ్లాండ్ పిచ్ ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవాలంటే టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అదీగాకుండా మొదటి రోజు పిచ్ మీద ఉండే తేమ బౌలర్లను అనుకూలిస్తుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకుంటారు....

1013

అయితే తొలుత బౌలింగ్ ఎంచుకున్న తర్వాత వీలైనంత తక్కువ స్కోరుకి ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. తొలి ఇన్నింగ్స్‌లో 350+ స్కోరు నమోదైతే, ఆధిక్యం సంపాదించాలంటే కనీసం 500+ స్కోరు చేయాల్సి ఉంటుంది. 

1113

లేదంటే నాలుగో ఇన్నింగ్స్‌లో 250+ టార్గెట్‌ను చేధించడం కూడా కష్టంగా మారుతుంది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 330 స్కోరు చేధించినప్పటికీ, అప్పటి పరిస్థితులు వేరు. ఆసీస్ పేస్ అటాక్‌తో పోలిస్తే న్యూజిలాండ్ పేస్ అటాక్ భిన్నంగా ఉంటుంది. 

1213

అదీకాకుండా న్యూజిలాండ్ బౌలర్లు ఉపయోగించే డ్యూక్ బాల్‌తో మనకి పెద్దగా అనుభవం లేదు. కాబట్టి బంతి వేగాన్ని, దిశను అంచనా వేస్తూ పరుగులు సాధించడం చాలా క్లిష్టమవుతుంది...

1313

ఈ మధ్యకాలంలో టాస్ గెలవడం కూడా అలవాటు చేసుకున్న విరాట్ కోహ్లీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టాస్ గెలిస్తే... సగం మ్యాచ్ గెలిచినట్టే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు... 

click me!

Recommended Stories