సచిన్ టెండూల్కర్ బ్యాటుతో వరల్డ్ రికార్డు బాదిన షాహిద్ ఆఫ్రిదీ... అతనికి ఎవరు ఇచ్చారంటే...

Published : Aug 18, 2023, 05:00 PM IST

పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ క్రీజులో అరగంట ఉన్నాడంటే చాలు, ప్రత్యర్థి జట్టుకి చెమటలు పట్టేవి. రాగానే అవుట్ కావడం ఆఫ్రిదీ స్పెషాలిటీ. ఒకవేళ అలా అవుట్ కాలేదా... బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడు..  

PREV
16
సచిన్ టెండూల్కర్ బ్యాటుతో వరల్డ్ రికార్డు బాదిన షాహిద్ ఆఫ్రిదీ... అతనికి ఎవరు ఇచ్చారంటే...

కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన షాహిద్ ఆఫ్రిదీ, 1996లొ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లో సెంచరీ బాది, ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ రికార్డు క్రియేట్ చేశాడు. 37 బంతుల్లో 11 సిక్సర్లు 6 ఫోర్లతో 102 పరుగులు చేశాడు షాహిద్ ఆఫ్రిదీ..

26

18 ఏళ్ల పాటు షాహిద్ ఆఫ్రిదీ రికార్డు చెక్కుచెదరలేదు. 2014లో కోరీ అండర్సన్, వెస్టిండీస్‌పై 36 బంతుల్లో వన్డే సెంచరీ బాదగా, 2015లో ఏబీ డివిల్లియర్స్ కూడా వెస్టిండీస్‌పైనే 31 బంతుల్లో సెంచరీ సాధించి.. ఇప్పటివరకూ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు..

36

అయితే షాహిద్ ఆఫ్రిదీ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడానికి వాడిన బ్యాటు, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌దేననే విషయం చాలామందికి తెలీదు. పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్, సచిన్ బ్యాటుని ఆఫ్రిదీకి ఇచ్చి బ్యాటింగ్‌కి పంపాడు...

46

‘శ్రీలంకతో వరల్డ్ రికార్డు సాధించిన బ్యాటు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. ఆ బ్యాటు నాకు చాలా చాలా స్పెషల్. అది నా ఫెవరెట్ క్రికెటర్లలో ఒకడైన సచిన్ టెండూల్కర్ బ్యాటు... ఆయనిచ్చిన బ్యాటుతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం ఎప్పటికీ మరిచిపోలేను..

56

వకార్ యూనిస్, సచిన్ టెండూల్కర్‌ని అడిగి నాకు ఆ బ్యాటు తెచ్చి ఇచ్చారు. మ్యాచ్‌కి ముందు వేరే బ్యాటుతోనే ప్రాక్టీస్ చేశా. యూనిస్ వచ్చి ఈ బ్యాటు ఇచ్చి, దీంతో మ్యాచ్ ఆడమని చెప్పాడు. సచిన్ బ్యాటు అని తేలియగానే సంతోషంతో బ్యాటింగ్ చేశా..

66

షాహిద్ ఆఫ్రిదీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే అందులో సచిన్ టెండూల్కర్ బ్యాటు పాత్ర ఎంతో ఉంది. ఆ తర్వాత కొన్నిసార్లు ఆ బ్యాటుతో ఆడాలని అనిపించింది. అయితే దాని విలువ తగ్గకూడదని మళ్లీ ఆ బ్యాటుతో ఆడలేదు..’ అంటూ కామెంట్ చేశాడు షాహిద్ ఆఫ్రిదీ..

click me!

Recommended Stories