ఎమ్మెస్ ధోనీ తర్వాత ఆ ఇద్దరే బెస్ట్ వికెట్ కీపర్లు... అశ్విన్ లిస్టులో రిషబ్ పంత్‌కి దక్కని చోటు...

First Published Dec 18, 2021, 1:40 PM IST

సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డులే లక్ష్యంగా విరాట్ కోహ్లీ దూసుకుపోతుంటే, అనిల్ కుంబ్లే రికార్డులే లక్ష్యంగా వికెట్ల వేటలో దూసుకుపోతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. సౌతాఫ్రికా టూర్‌కి ముందు ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు అశ్విన్...

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 14 వికెట్లు తీసి‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టు కెరీర్‌లో 9వ సారి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు...

అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా హర్భజన్ సింగ్‌ (417) ను దాటేసిన రవిచంద్రన్ అశ్విన్ (427), మరో 8 వికెట్లు తీస్తే కపిల్‌దేవ్ (434) రికార్డును కూడా అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్‌గా కుంబ్లే తర్వాతి స్థానంలో నిలుస్తాడు...

‘నా దృష్టిలో టాప్ 3 ఇండియన్ వికెట్ కీపర్లు... ఎమ్మెస్ ధోనీ, వృద్ధిమాన్ సాహా, దినేశ్ కార్తీక్. వికెట్ల వెనకాల ఈ ముగ్గురూ అద్భుతంగా కీపింగ్ చేస్తారు....

తమిళనాడు తరుపున ఆడినప్పుడు దినేశ్ కార్తీక్‌తో కలిసి చాలా క్రికెట్ ఆడాను. కానీ నెం.1 వికెట్ కీపర్ ఎవరంటే మాత్రం ఎమ్మెస్ ధోనీనే సెలక్ట్ చేసుకుంటాను...

ఎందుకంటే చాలా కష్టమైన బంతులను కూడా ఎంతో ఈజీగా అందుకుంటాడు ఎమ్మెస్ ధోనీ. చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజున ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఎడ్ కోవన్‌ను అవుట్ చేసిన విధానం అద్భుతం...

ఎందుకంటే ఆ బాల్ స్పిన్ తిరగలేదు, కానీ బౌన్స్ అయ్యింది. అయినా వికెట్ల వెనకాల ఎమ్మెస్ ధోనీ మెరుపులా కదిలి, ఆ బంతిని అందుకుని స్టంపౌట్ చేశాడు... 

మాహీ చేసినప్పుడు అది చాలా సింపుల్‌గా అనిపించినా, ఆ అవుట్‌లో క్రెడిట్‌ ఎక్కువగా అతనికే దక్కుతుంది. అంతేకాకుండా మాహీ బంతిని మిస్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది...

స్టంపౌట్ కానీ, రనౌట్ కానీ  లేదా క్యాచులు కానీ స్పిన్ బౌలింగ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఓ అద్భుతమైన వికెట్ కీపర్. 

వృద్ధిమాన్ సాహా కూడా దాదాపు మాహీలాగే కదులుతాడు... స్పిన్ బౌలింగ్‌లో సాహా కీపింగ్ టాప్ క్లాస్‌గా ఉంటుంది...

రిషబ్ పంత్‌ గురించి ఇప్పుడేం ఏమీ చెప్పలేను. ఎందుకంటే అతనికి ఇంకా చాలా అనుభవం అవసరం...’ అంటూ చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...

ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ టెస్టు తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, గబ్బా టెస్టు తర్వాత మూడు ఫార్మాట్లలోనూ రెగ్యూలర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు...

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్‌కి రెస్ట్ ఇవ్వడంతో అతని స్థానంలో వృద్ధిమాన్ సాహాకి అవకాశం దక్కింది. మొదటి టెస్టులో సాహా గాయపడడంతో కెఎస్ భరత్ వికెట్ కీపింగ్ చేసి ఆకట్టుకున్నాడు...

click me!